Moviesఏ సంబంధం లేదన్నా గ‌జాలాకి ఆ హీరోతో అఫైర్... అస‌లేం జ‌రిగింది..!

ఏ సంబంధం లేదన్నా గ‌జాలాకి ఆ హీరోతో అఫైర్… అస‌లేం జ‌రిగింది..!

గజాలా..చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ తెచ్చుకుంది. దీనికి కారణం ఒకరకంగా ఎన్.టి,ఆర్ అని కూడా చెప్పొచ్చు. ఆయన హీరోగా నటించిన స్టూడెంట్ నెం 1 సినిమాతో అందరి దృష్ఠిని ఆకర్షించిన గజాలా మరోసారి అల్లరి రాముడు సినిమాలో చేసింది. ఆర్తి అగర్వాల్ తో పాటు గజాలా కూడా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో కలుసుకోవాలని, ఓ చినదాన, అదృష్టం, తొట్టి గ్యాంగ్ లాంటి సినిమాలలో నటించింది. తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషలలో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకుంది.

అయితే సాధారణంగా హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలు చేశాక వచ్చే పాపులారిటీతో తాము ఏం చేస్తున్నామో అని ఆలోచించరు. క్రేజ్, పాపులారిటీ వస్తుంది..దాంతో డబ్బు వస్తుంది. వీటివల్ల బడా బాబులు..బిజినెస్ మేన్ సహా వివిధ రంగాలలో ఉన్నవారు పరిచయం కావడం వారితో సన్నిహితంగా మెలగడం..హైఫై లైఫ్ కి అలవాటు పడటం ఈ క్రమంలో అనుకోను చిక్కుల్లో పడి లైఫ్ స్పాయిల్ చేసుకోవడం ఎంతోమంది విషయంలో చూసిందే.

కావాలని కాకపోయినా కొందరు మరీ లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడి ప్రేమలో పడి మోసపోవడం… దాంతో జీవితం మీద విరక్తి కలిగి తనువు చాలించాలనుకోవడం అన్నీ సినీ పరిశ్రమలలో చూసిందే. ఇలాంటి ఓ సంఘటన హీరోయిన్ గజాలా జీవితంలోనూ జరిగింది. కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్నప్పుడు గజాలా ఓ బడా బాబుతో ప్రేమాయణం సాగించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఆ ప్రేమలో మోసపోయి బాగా డిప్రెష‌న్ కి లోనయింది. దాంతో చాలా కృంగిపోయి జీవితం మీద విరక్తి చెంది నిద్ర మాత్రలు మోతాదుకి మించి తినేసింది.

ఆ సమయంలో హీరో అర్జున్‌తో కలిసి సినిమా చేస్తుంది గజాలా. షూటింగ్ షెడ్యూల్ నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. గెస్ట్ హౌజ్‌లో ఇద్దరూ వేరే వేరే గదుల్లో ఉన్నారు. అయితే, నిద్రమాత్రలు మింగిన గజాలా ప్రాణాపాయ స్థిలో ఉండి అర్జున్ కి ఫోన్ చేసి ‘సర్ జీ’… అంటూ చెప్పాల‌నుకున్న విషయాన్ని చెప్పలేక‌ ఆపస్మారక స్థిలోకి వెళ్ళింది. గజాలా మాట విన్న అర్జున్ వెంటనే వెళ్ళి చూస్తే గజాలా పరిస్థితి విషమంగా ఉంది. వెనకా ముందు ఆలోచించకుండా చేతూలపై వేసుకొని ఆసుపత్రికి తీసుకెళ్ళారు.

ఇంతలోనే మీడియా వారు దాన్ని కెమెరాలలో షూట్ చేసి కొన్ని నిముషాలలోనే ఎవరికి తోచినట్టు వారు కథనాలు అల్లారు. అర్జున్ మోసం చేయడం వల్లే గజాలా ఆత్మ హత్య చేసుకోబోయిందని వార్తలు పుట్టించారు. అసలు విషయం తర్వాత అర్జున్ ద్వారా తెలుసుకొని మళ్ళీ క్లారిటీ ఇచ్చారు. అయితే, ఆరోజు ఎందుకు గజాలా అలా ఆత్మ హత్య చేసుకోబోయిందో ? ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. అయితే ఆమె ప్రేమ‌లో మోస‌పోవ‌డం వ‌ల్లే ఇలా చేసింద‌ని టాక్ ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news