Moviesనాకు ఆ మూడ్ లేదు.. యాంకర్ పై RGV సీరియస్ ..!!

నాకు ఆ మూడ్ లేదు.. యాంకర్ పై RGV సీరియస్ ..!!

RGV … ఈ పేరు సినీ ఇండస్ట్రీలోనే కాదు రాజకీయాల్లోను వేళు పెట్టి హైలెట్ గా మారింది. ప్రజెంట్ రాజకీయాలు అంటేనే ఓ గందరగోళం అని భావేంచే పాలిటిక్స్ లో .. కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేసే RGV ఎంటర్ అవ్వడంతో ఇంకా రచ్చ రచ్చ అయిపోయింది. గిల్లి గిల్లించుకోవడం ఈయనగారికి బాగా అలవాటు. అసలు కావాలని వివాదాల్లోకి దూరుతాడో లేక అసలు అతని నైజం అంతేనా అనేది మాత్రం ఎవరికీ అంతుపట్టని విషయం.రామ్ గోపాల్ వర్మ ఇష్యూ ఏదైనా తనదైన శైలిలో స్పందిస్తారు. ఏదైతేనేం..ఆ ప్రాబ్లామ్‌స్ కు ఫుల్ స్టార్ పెట్టేసి.. ప్రజెంట్ తన సినిమాల పై దృష్టి పెట్టాడు రామ్ గోపాల్ వర్మ.

వర్మ మార్క్ అంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంచలనాల దర్శకుడు ఇప్పుడు లడ్కీ అంటూ మరో సరికొత్త కాన్ సెప్ట్ ను జనాలకు రుచి చూయించబోతున్నాడు. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిన ఈ సినిమా లో పూజా భలేకర్ మెయిన్ లీడ్ రోల్ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ కుర్రకారుని ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా జూలై 15న తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, చైనా భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. వర్మ టీమ్ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. అంతా బాగానే జరిగిన ఈ ఈవెంట్ కి యాంకర్ శ్యామల హోస్ట్ గా వచ్చింది.గతంలో ఓ సినిమా ఈవెంట్ లో వర్మ..శ్యామల పై చేసిన హాట్ కామెంట్స్ అందరికి గుతుండే ఉంటాయి. ఇంత అందం ఇన్నాళ్లు నా కళ్ళకు ఎందుకు కనిపించలేదు అంటూ శ్యామల తో అన్నాడు. ఇక ఈ ఫంక్స్లో ఇద్దరు మళ్ళీ మీట్ అయ్యేసరికి..ఏదో ఒక హాట్ ఇష్యూ జరుగుతుందని అనుకున్నారంతా. శ్యామల ఈ ఈవెంట్ లో కొన్ని ఫన్ గేమ్స్ తో వర్మ ని అలరించే ప్రయత్నం చేసింది. అంతే ఒక్కసారిగా వర్మ లోని మరో యాంగిల్ బయటపెట్టాడు. స్టేజిపై మాట్లాడటానికి వచ్చిన రామ్ గోపాల్ వర్మ.. మాట్లాడి దిగిపోతుండగా ఆపిన శ్యామల..పై ఆయనఫైర్ అయ్యారు. కోపంగా ఫేస్ పెట్టి.. సినిమా విషయంలో చాలా డిస్టర్బ్ గా ఉన్నా అంటూ సీరియస్ గా చెప్పి..జోకులు కాదు.. ఎమోషన్.. సినిమాపై సీరియస్ నెస్ అంటూ.. కోపంగా స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు. దీంతో శ్యామల పరువు పోయిన్నట్లైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news