Moviesబావ‌బావ‌మ‌రుదులు అవుతోన్న మెగా - నంద‌మూరి హీరోలు... ఆ స్టోరీ ఇదే...!

బావ‌బావ‌మ‌రుదులు అవుతోన్న మెగా – నంద‌మూరి హీరోలు… ఆ స్టోరీ ఇదే…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నాడు. తాజాగా త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్‌ను ఎన్టీఆర్ త‌న ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాలో ఎవరు ఊహించని విధంగా టాలీవుడ్ లోనే రెండు వేరువేరు వర్గాలకు ప్రాథినిత్యం వహిస్తూ… స్టార్ హీరోలుగా కొనసాగుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ఒకే తెర మీదకు తీసుకు వచ్చారు. ఇలాంటి గొప్ప సాహసం చేసిన ఘనత ఒక్క రాజమౌళికి మాత్రమే దక్కుతుంది.

అలాంటిది మ‌రోసారి మెగా – నంద‌మూరి కాంపౌండ్ హీరోల కాంబినేష‌న్లో మ‌ల్టీస్టార‌ర్ ఫిక్స్ అయ్యే సూచ‌న‌లు ఉన్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. యాక్సిడెంట్ గాయాల నుంచి కోలుకున్న మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం త‌న మేన‌మామ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి వినోద‌యం సీతం రీమేక్‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ప‌వ‌న్ పాత్ర త‌క్కువ సేపు మాత్ర‌మే ఉంటుంది. మిగిలిన సినిమా అంతా సాయితేజ్ భుజ‌స్కంధాల మీదే న‌డుస్తుంది.

అయితే ప‌వ‌న్ సినిమాల‌తో పాటు అటు రాజ‌కీయాల్లోనూ బిజీగా ఉండి డేట్లు ఎడ్జెస్ట్ చేయ‌డం లేదు. దీంతో సాయితేజ్ ఈ గ్యాప్‌లో మ‌రో సినిమాలో గెస్ట్ రోల్ చేసేందుకు ఓకే చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది. అదే ఎన్టీఆర్ సినిమా. ఎన్టీఆర్ – కొర‌టాల శివ కాంబినేష‌న్లో వ‌చ్చిన సినిమాలో ఎన్టీఆర్ బావ‌మ‌రిదిగా చిన్న రోల్లో సాయితేజ్ కొద్ది సేపు క‌నిపిస్తాడ‌ట‌. ఎన్టీఆర్‌కు జోడీగా సెకండ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న పాత్ర‌కు సాయితేజ్‌ది అన్నయ్య పాత్ర అని తెలుస్తోంది.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫ‌స్ట్ లుక్ చూస్తుంటేనే ఈ సినిమా యాక్ష‌న్ ట్రీట్ అన్న‌ది అర్థ‌మైపోతోంది. కొర‌టాల పాన్ ఇండియా లెవ‌ల్లో ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌డంతో కాస్టింగ్ విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డ‌డం లేదు. అందుకే బాలీవుడ్ హీరోయిన్‌ను సెట్ చేస్తున్నారు. ఇటు రాజ‌మౌళి స్టైల్లోనే మెగా – నంద‌మూరి కాంపౌండ్‌ను సెట్ చేస్తున్నాడు. ఏదేమైనా మ‌రోసారి నంద‌మూరి – మెగా హీరోల సినిమా అంటే మామూలు పండ‌గ కాదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news