Moviesపూరీ బిగ్ మిస్టేక్..లైగర్ ట్రైలర్ లో ఇది గమనించారా..ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా..?

పూరీ బిగ్ మిస్టేక్..లైగర్ ట్రైలర్ లో ఇది గమనించారా..ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా..?

కొద్ది సేపటి క్రితమే రిలీజ్ అయిన లైగర్ మూవీ ట్రైలర్ అభిమానులకు భీబత్సంగా నచ్చేసింది. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ..బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కలిసి నటించిన సినిమా లైగర్. టాలీవుడ్ డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని గురువారం ఉదయం మెగాస్టార్‌ చిరంజీవి, పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు.

విజయ్ అభిమానులు ఈ సినిమా ట్రైలర్ చూశాక అస్సలు ఆగడం లేదు. ఓ రేంజ్ లో సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. మాస్‌ డైలాగ్స్‌, భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో ట్రైలర్‌ అదిరిపోయింది. మరీ ముఖ్యంగా సినిమాలో రమ్య కృష్ణ చెప్పే డైలాగ్ ‘ఒక లైయన్‌కి, టైగర్‌కి పుట్టిండాడు. క్రాస్‌ బ్రీడ్‌ సాలా వాడు’ అంటూ సాగే డైలాగ్‌ అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. అయితే , సినిమా ట్రైలర్ అంతా బాగానే ఉన్నా..ఎక్కడో సినిమా ట్రైలర్ చూస్తుంటే పూరీ గత తాలుకా సినిమా..”అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి”..లా అనిపిస్తుంది.

ఫుల్ మదర్ సెంటిమెంట్ తో ఈ సినిమా నడుస్తుందని ట్రైలర్ ని బట్టే అర్ధమవుతుంది. బాక్సింగ్ నేపధ్యంలో సాగే ఈ మూవీ లో విజయ్ పర్ ఫామెన్స్ నెక్స్ట్ లెవల్ అని చెప్పవచ్చు. అయితే, ఈ సినిమాలో విజయ్ కి నత్తిలా చూయించారు. అమ్మాయి కి ఐ లవ్ యూ చెప్పేటప్పుడు..విజయ్ నత్తి క్లీయర్ గా అర్ధమవుతుంది. అర్జున్ రెడ్డి సినిమాలో ఒక్కో డైలాగ్ ఎలా పేలిందో మనకు తెలిసిందే.

అలాంటిది అలాంటి హీరో చేత యువత ఆకట్టుకునే డైలాగ్స్ చెప్పించాలే కానీ..ఈ నత్తి యవ్వారాలు ఏంది సామీ అంటూ పూరీ పై అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ నత్తి ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో డౌటే..ఒక్కవేళ అదే జరిగితే సినిమా సగం దెబ్బైపోయిన్నట్లే..అంటున్నారు విశ్లేషకులు..మరి చూడాలి మూవీ ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news