Moviesమ్యాటర్ ఫినిష్ చేసి సిస్టర్ అంటాడు..స్టార్ హీరో పై సదా బిగ్...

మ్యాటర్ ఫినిష్ చేసి సిస్టర్ అంటాడు..స్టార్ హీరో పై సదా బిగ్ బాంబ్..!!

సినీ ఇండస్ట్రీలో రూమర్స్ సర్వ సాధారణం. సైలెంట్ గా ఉండే హీరోయిన్స్ కి కూడా లింకులు పెట్టేస్తారు. ఇది ఇండస్ట్రీలో తరతరాలుగా మారకుండా వస్తున్న ఆచారం. వాళ్లల్లో హీరోయిన్ సదా కూడా ఒకరు. సినీ ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ టైంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయింది ఈ బ్యూటి. వరుసగా స్టార్ హీరో సినిమాల్లో నటించే అవకాశాలు అందుకుని అటు కోలీవుడ్..ఇటు టాలీవుడ్ రెండింటిలోను నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటి..ప్రజెంట్ అవకాశాలు లేక ఖాళీ గా ఉంది.

అయితే, హీరోయిన్ గా సదా అందుకున్న కొన్ని హిట్లల్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ సినిమా “అపరిచితుడు”. మల్టీ టాలెంటెడ్ విక్రమ్ ఈ సినిమాలో హీరో గా నటించాడు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమా ను తనదైన స్టైల్ లో డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో విక్రమ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాదు, తెర పై వీళ్ల కెమిస్ట్రీ సరికొత్త మార్క్ సృష్టించింది. ఈ సినిమాలో విక్రమ్, సదా.. క్యారెక్టర్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. అయితే, ఈ సినిమా టైంలో సదా , విక్రమ్ మధ్య జరిగిన ఫన్నీ సీన్స్ ని సదా ఓ ఇంటర్వ్యుల్లో బయటపెట్టారు.

ఆమె మాట్లాడుతూ..” సినిమాలో మా మధ్య కెమిస్ట్రీ బాగ్ వర్క్ అవుట్ అయ్యిందని అంతా అన్నారు. కానీ, ఆ టైంలో మేము నవ్వి నవ్వి చచ్చిపోయాం. షాట్ రెడీ అని శంకర్ షూటింగ్ సీన్ వివరించే ముందు వరకు బాగానే ఉంటుంది. కానీ, సినిమా షాట్ అయ్యాక..రొమాంటిక్ సీన్స్ లో నటించాక..విక్రమ్ నన్ను సిస్టర్ అంటూ పిల్చుకొచ్చేవాడు. దీంతో అక్కడే ఉన్న వారితో సహా నాకు నవ్వు వచ్చేది. మళ్లీ పక్క రోజు సినిమా షూటింగ్ రోమాంటిక్ సీన్స్ అప్పుడు..సిస్టర్ అంటూ స్టార్ట్ చేసేవాడు..ఇలానే సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది..” అంటూ చెప్పుకొచ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news