Moviesఎన్టీఆర్ 30కు అల్లు అర్జున్‌కు ఇంత లింక్ ఉందా... షాకింగ్ రీజ‌న్‌..!

ఎన్టీఆర్ 30కు అల్లు అర్జున్‌కు ఇంత లింక్ ఉందా… షాకింగ్ రీజ‌న్‌..!

ఎస్ ఇది నిజం.. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సినిమాకు అటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమాకు లింక్ ఉంది. ఇప్ప‌టికే ఆరు వ‌రుస హిట్లతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న ఎన్టీఆర్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా రెండు పాన్ ఇండియా సినిమాల‌ను లైన్లో పెట్టాడు. ఇందులో ముందుగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా తెర‌కెక్కుతోంది. ఆ వెంట‌నే కేజీయఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేసే సినిమాలో ఎన్టీఆర్ న‌టిస్తాడు.

ఇక బ‌న్నీ విష‌యానికి వ‌స్తే అల వైకుంఠ‌పురంలో, పుష్ప లాంటి రెండు సూప‌ర్ డూప‌ర్ హిట్ల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలోనే పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తోన్న పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. పుష్ప ది రూల్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ ఈ సినిమాను వ‌చ్చే యేడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు. ఇదిలా ఉంటే బ‌న్నీ – కొర‌టాల కాంబినేష‌న్లో గ‌తంలోనే ఓ సినిమా తెర‌కెక్కాల్సి ఉంది.

#AA21 వర్కింగ్ టైటిల్ తో ఓ పోస్టర్ ను కూడా రిలీజ్‌ చేశారు. యువ‌సుధా ఆర్ట్స్‌, జీఏ 2 బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ క్రేజీ ప్రాజక్టును నిర్మించాల‌ని అనుకున్నాయి. అయితే రీసెంట్‌గా కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో చిరు – చెర్రీ కాంబినేష‌న్లో వ‌చ్చిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణంగా త‌న్నేసింది. కొరటాల నుంచి ఇలాంటి సినిమానా.. తాము ఊహించలేదని చాలా మంది షాక్ అయ్యారు.
ఆచార్య వ‌చ్చి మూడు నెలలు అవుతున్నా ద‌ర్శ‌కుడు కొర‌టాల ఈ సినిమా క‌ష్టాల నుంచి ఇంకా బ‌య‌ట ప‌డ‌లేదు.

ఇప్ప‌టి వ‌ర‌కు కొర‌టాల అంటే గుడ్డి న‌మ్మ‌కం. ఆచార్య త‌ర్వాత కొర‌టాల‌తో సినిమా చేసేందుకు మీడియం రేంజ్ హీరోలు కూడా వెన‌క‌డుగు వేస్తున్నారు. అందుకే ఎన్టీఆర్ సైతం క‌థ‌లో అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తుండ‌డంతో ఆ సినిమా ఇంకా ప‌ట్టాలు ఎక్క‌లేదు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ – యువ‌సుధా ఆర్ట్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన గ్లింప్స్ కూడా ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది.

త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ సినిమా హిట్ అయితేనే బ‌న్నీ త‌న నెక్ట్స్ సినిమా ఛాన్స్ కొర‌టాల‌కు ఇస్తాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్న బ‌న్నీ రిస్క్ చేసేందుకు ఇష్టంగా లేడు. అందుకే కొర‌టాల ఎన్టీఆర్‌కు హిట్ ఇస్తేనే తాను ఛాన్స్ ఇస్తాడే కాని.. లేక‌పోతే కొర‌టాల‌ను లైట్ తీస్కొనేలాగానే ఉన్నాడు. ఇప్పుడు కొర‌టాల బ‌న్నీతో సినిమా చేయాలంటే ఎన్టీఆర్ సినిమాతో త‌ప్ప‌క హిట్ కొట్టాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news