Moviesనాన్న మాట విని..ప్రేమించిన అమ్మాయిని వదిలేసిన మన టాలీవుడ్ స్టార్ హీరో...

నాన్న మాట విని..ప్రేమించిన అమ్మాయిని వదిలేసిన మన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిలు, విడాకులు, డేటింగ్ లు కామన్. మరీ ముఖ్యంగా ఈ మధ్య విడాకులు అన్న పదం చాలా ఎక్కువ గా కనిపిస్తుంది. యంగ్ కపుల్స్ నుండి సీనియర్ హీరో, హీరోయిన్ల వరకు అందరి విడాకులు బాట పడుతున్నారు. దీనికి కారణాలు ఏంటో చెప్పలేం కానీ..వాళ్లు చేసేది తప్పు అని మాత్రం అంటున్నారు వాళ్ల అభిమానులు. అయితే, ఇలా స్టార్స్ వరుస విడాకుల నేపధ్యంలో సినీ ఇండస్ట్రీలో ఓ ఓల్డ్ లవ్ స్టోరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం నాలుగు బడా ఫ్యామిలీల చేతిలో తిరుగుతుంది. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వకుండా..ఉన్న హీరోలే సినీ ఇండస్ట్రీని పంచేసుకుంటూ ఏలేస్తున్నారు. అయితే, ఇలా సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా చలామణీ అయిన ఓ సీనియర్ హీరో..ప్రజెంట్ కూడా సినిమాలు చేస్తున్నాడు. ఆయన తండ్రి మాట జవదాటడు. నాన్న చెప్పిందే వేదం. నాన్న చెప్పింది తూ ఛా తప్ప కుండా పాటిస్తాడు. అలాంటి హీరో..నాన్న చెప్పిన మాటలు విని..ప్రాణం కన్నా ఎక్కువుగా ప్రేమించిన హీరోయిన్ ని వదిలేసుకున్నాడు. ఈ విషయంలో అప్పట్లో సంచలనం సృష్టించింది.

సినీ తెర పై ఈ జంట కు బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు. తెర పై ఈ జంట కనిపిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే. బయట కూడా అలానే రాసుకుని పూసుకుని ఉన్నారు. షాకింగ్ ట్వీస్ట్ ఎమిటంటే అప్పటికే ఆ స్టార్ హీరో సన్ కి పెళ్లైంది కానీ,..అందాల హీరోయిన్ తో కనెక్ట్ అయ్యారు. ఇదే విషయాని నాన్నకి వెళ్లి చెప్పారు. అయితే, స్టార్ స్టేటస్ గల తండ్రి కొడుకులు మాటలు విని షాక్ అయ్యాడు. ఇండస్ట్రీలో పరువు పోతుంది.. ఆ హీరోయిన్ ఓ మాయలాడి అంటూ ఆమెను కొడుకు కు దూరం పెట్టాడు.

సినీ ఇండస్ట్రీలో ఆమె ఎక్కి రాకుండా చేశాడు. అయితే, విధి ఆడిన వింత నాటకంలో ఆమె తిరిగిరానిలోకనికి వెళ్లిపోయింది. ఈ విషయం పై ఇప్పటికి ఆయన బయట కనిపిస్తే మీడియా ప్రశ్నిస్తూనే ఉంటుంది. కానీ, ఇండస్ట్రీ పెద్దలు మాత్రం పెద్దగా పట్టించుకోరు. పెద్దింటి పిల్లలు ఏం చేసినా సైలెంట్ గానే ఉంటుంది ఈ సినీ ఇండస్ట్రీ .!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news