Moviesబాల‌య్య ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పించే అప్‌డేట్‌.. ఈ నెల 24నే ముహూర్తం...!

బాల‌య్య ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పించే అప్‌డేట్‌.. ఈ నెల 24నే ముహూర్తం…!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ త‌ర్వాత వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టుల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే బాల‌య్య హీరోగా ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ మాస్ ప్రాజెక్ట్ లో న‌టిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. అటు మైత్రీ మూవీస్ బ్యాన‌ర్‌.. బ‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డ‌డం లేదు. శృతీహాస‌న్ బాల‌య్య‌కు జోడీ క‌డుతోంది. బాల‌య్య – శృతీ జోడీ అంటే మామూలుగా ఉండ‌దు.

పైగా కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ సైతం మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. అఖండ‌కు అదిరిపోయే స్వ‌రాలు అందించిన‌.. బీజీఎంతో బాక్సులు బ‌ద్ద‌ల‌య్యేలా చేసిన థ‌మ‌నే ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. అటు క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ విల‌న్‌గా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫ‌స్ట్ లుక్ ప్రేక్ష‌కుల్లో భారీ హైప్స్ పెంచేసింది.

టీజ‌ర్‌కూ అదిరిపోయే రెస్సాన్స్ రావ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే టైటిల్ విష‌యంలో ఇంకా మేక‌ర్స్ స‌స్పెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. రెడ్డి గారు – జై బాల‌య్యా – విజ‌య‌సింహారెడ్డి ఇలా రెండు మూడు పేర్లు లైన్లో ఉన్నాయి. ఎక్కువ మంది జై బాల‌య్యా అంటున్నారు. కానీ ఏ టైటిల్ ఇంకా అధికారికంగా చెప్ప‌నే లేదు. అయితే మోస్ట్ అవైటెడ్ టైటిల్‌పై అనౌన్స్‌మెంట్ వ‌చ్చేందుకు ముహూర్తం ఫిక్స్ అయిన‌ట్టే తెలుస్తోంది.

ఈ నెల 24న ఈ సినిమా టైటిల్ గురించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుందంటున్నారు. టైటిల్ వ‌స్తే బాల‌య్య ఫ్యాన్స్ సంబ‌రాలు అయితే మామూలుగా ఉండ‌వు. ఈ నెల‌లోనే క‌ర్నూలు షెడ్యూల్ కూడా స్టార్ట్ కానుంది. ప‌ది రోజుల పాటు ఈ షెడ్యూల్ కొన‌సాగుతుంద‌ని తెలుస్తోంది. అన్నీ అనుకున్న‌ట్టుగా జ‌రిగితే ద‌స‌రా బ‌రిలోనే ఈ సినిమాను దింపేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news