Moviesఎన్టీఆరే కావాల‌ని ఈ హీరోయిన్లు ఎందుకు క్యూ క‌ట్టేవారంటే...!

ఎన్టీఆరే కావాల‌ని ఈ హీరోయిన్లు ఎందుకు క్యూ క‌ట్టేవారంటే…!

సాధార‌ణంగా.. ఇప్పుడు సినిమాల్లో ప్ర‌త్యేకంగా హీరో హీరోయిన్లు.. ముద్ర వేసుకునే ప‌రిస్థితి లేదు. అంటే.. ఒక హీరోకు ఒక హీరోయిన్ అయితే.. బాగుంటుంది.. సూప‌ర్ హిట్ జోడీ .. అనే మాట ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థి తిలో ఎక్క‌డా వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. ఒక సినిమాలో చేసిన హీరోయిన్‌.. రెండో సినిమాలో మారుపోతున్న ప‌రిస్థితి ఉంది. ఎప్పుడో ఒక‌టి రెండు సినిమాలు త‌ప్ప‌.. ఒకే హీరోయిన్‌.. ఒకే హీరో క‌లిసి చేస్తున్న సినిమాలు కూడా రావ‌డం లేదు. ఆ మాట‌కు వ‌స్తే హీరోలే యేడాదికి, రెండేళ్ల‌కు ఒక సినిమా చేస్తున్నారు.

ఈ లెక్క‌న హీరో, హీరోయిన్లు క‌లిసి రెండు, మూడు సినిమాల్లో న‌టించాలంటేనే యేళ్ల‌కు యేళ్లు ప‌డుతోంది. అందుకే హీరో, హీరోయిన్ కాంబినేష‌న్లు గ‌తంలోలా రిపీట్ కావ‌డం లేదు. అయితే.. సీనియ‌ర్‌ ఎన్టీఆర్ హయాంలో మాత్రం ఇలా లేదు. ఒక హీరో.. ఒక హీరోయిన్‌.. జోడీ అంటే.. వారితో నే వ‌రుస‌గా సినిమాలు వ‌చ్చిన ప‌రిస్థితి క‌నిపిస్తుంది. అప్ప‌టి త‌రంతో ఎన్టీఆర్‌, ఎన్నార్‌, కృష్ణ లాంటి స్టార్ హీరోలు చాలా మంది హీరోయిన్ల‌తో ప‌దుల సంఖ్య‌లో సినిమాలు చేశారు.

అప్ప‌ట్లో నాగేశ్వ‌ర‌రావు కంటే.. కూడా ఎన్టీఆర్‌తో న‌టించేందుకు.. హీరోయిన్లు క్యూక‌ట్టేవారు. ఎన్టీఆర్ సినిమాలో న‌టించేందుకు ఆస‌క్తి చూపించేవారు. సావిత్రి నుంచి వాణిశ్రీ వ‌ర‌కు.. అంద‌రూ కూడా ఎన్టీఆర్‌ను ఇష్ట‌ప‌డే వారు. వ‌రుస‌గా సావిత్రి-ఎన్టీఆర్ కాంబినేష‌న్‌, వాణిశ్రీ-ఎన్టీఆర్ కాంబినేష‌న్ చిత్రాలు వ‌చ్చిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఆత‌ర్వాత‌.. మ‌ళ్లీ జ‌య‌ప్ర‌ద‌, శ్రీదేవిలు కూడా.. ఎన్టీఆర్‌తో ఎక్కువ‌గా వ‌రుస సినిమాలు చేశారు. ఇలా.. ఎన్టీఆర్‌తోనే ఎక్కువ‌గా వారు న‌టించారు.

వాస్త‌వానికి అప్ప‌ట్లో అక్కినేని హ‌వా కూడా ఫుల్ రేంజ్‌లో కొన‌సాగినా.. ఆయ‌న కంటే కూడా.. ఎన్టీఆర్‌తో చేసేందుకే ఎక్కువ మంది హీరోయిన్లు ఇష్ట‌ప‌డేవార‌ట‌. దీనికి కార‌ణం.. ఏ పాత్ర‌లో అయినా.. ఆయ‌నతో క‌లిసి న‌టిస్తే.. చాలు.. అనుకోవ‌డ‌మే. ఇండ‌స్ట్రీలో ఎన్టీఆర్ అంటే.. ఒక గంభీర‌మైన గుర్తింపు ఉంది. ఆయ‌న వాచ‌కం.. డైలాగు చెప్పే స్ట‌యిల్‌.. న‌టించే సీన్లు.. ఇలా ప్ర‌తివిష‌యంలోనూ ప్ర‌త్యేక‌త సంత‌రించుకున్నారు.

ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టిస్తే.. ఇటు ప్ర‌జ‌ల్లోనూ.. అటు నిర్మాతల్లోనూ.. గుర్తింపు ఉండేది. “ఏ అమ్మాయ్‌.. ఎన్టీఆర్‌తో న‌టించ‌డం అంటే.. మాట‌ల‌నుకున్నావా..“ అనే రోజుల్లో.. ఈ ఘ‌ట‌న‌లు చోటు చేసుకునేవి. నిజం చెప్పాలంటే.. సావిత్రికి కూడా ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. అయితే.. ఆమె త‌న న‌ట‌న‌ను మెరుగు ప‌రుచుకుని.. ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో దూసుకుపోయింది. ఇక‌, వాణిశ్రీ విష‌యంలోనూ ఇంతే. మెరుగైన న‌ట‌న‌, అంత‌కుమించిన అభిన‌యం.. వంటివి అన్న‌గారి స‌ర‌స‌న న‌టించేందుకు హీరోయిన్ల‌ను ఆతృత‌ప‌డేలా చేశాయంటే అతిశ‌యోక్తి కాదు. దీనికి ద‌ర్శ‌కుల ప్రోత్సాహం కూడా ఉండేది. అందుకే.. అన్న‌గారి హీరోయిన్ అనే ముద్ర కోసం నాయ‌కీమ‌ణులు ఆరాట ప‌డేవారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news