Moviesటాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో హీరో మృతి

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో హీరో మృతి

టాలీవుడ్‌లో తీర‌ని విషాదం చోటు చేసుకుంది. ఓ హీరోను ఇండ‌స్ట్రీ కోల్పోయింది. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ప‌లు సినిమాల్లో న‌టించి త‌ర్వాత హీరో అయిన హీరో స‌త్య గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. వ‌రం సినిమాతో హీరోగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన స‌త్య అనే న‌టుడు గురువారం గుండెపోటుతో మృతిచెందాడు. ప్ర‌స్తుతం సినిమా ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంటూ త‌న వ్యాపారాల్లో బిజీగా ఉన్నాడు. గురువారం సాయంత్రం అక‌స్మాత్తుగా గుండెపోటు రావ‌డంతో కుటుంబ స‌భ్యులు ద‌గ్గ‌ర్లో ఉన్న ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

అయితే ఆయ‌న్ను ప‌రీక్షించిన వైద్యులు అప్ప‌టికే స‌త్య మృతిచెందిన‌ట్టు చెప్పారు. స‌త్య మృతి వార్త‌ను ఆయ‌న కుటుంబ స‌భ్యులు అధికారికంగా వెల్ల‌డించారు. శుక్ర‌వారం ఆయ‌న అంత్య‌క్రియ‌లు ఈఎస్ఐ స్మ‌శాన వాటిక నందు నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలియ‌జేశారు. స‌త్య అస‌లు పేరు వి. రామ‌స‌త్య‌నారాయ‌ణ‌. ఆయ‌న తండ్రి పేరు రెడ్డ‌ప్పచారి.

స‌త్య ముందుగా క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాల్లో న‌టించారు. ఆ త‌ర్వాత వ‌రం సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. బ్యాచిల‌ర్స్ లాంటి సినిమా కూడా చేశాడు. ఈ రెండు సినిమాలు స‌త్య‌కు న‌టుడిగా అనుకున్న పేరు తీసుకు రాక‌పోవ‌డంతో త‌ర్వాత సినిమాల‌కు గుడ్ బై చెప్పేసి వ్యాపారంలోకి వెళ్లిపోయాడు. అదే టైంలో క‌రోనా సెకండ్ వేవ్ స‌త్య జీవితాన్ని తల్ల‌కిందులు చేసేసింది.

వారం రోజుల తేడాలో స‌త్య‌ తన భార్యని, తల్లిని కోల్పోయారు. అప్ప‌టి నుంచి తీవ్ర మాన‌సిక క్షోభ అనుభ‌విస్తోన్న స‌త్య ఇప్పుడు గుండెపోటుతో చ‌నిపోయారు. స‌త్య‌కు 8 ఏళ్ల కుమార్తె రిత్విక ఉంది. స‌త్య మృతి తెలిసిన ఇండ‌స్ట్రీలోని ఆయ‌న స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని సంతాపం తెలుపుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news