ReviewsTL రివ్యూ: అంటే సుంద‌రానికి

TL రివ్యూ: అంటే సుంద‌రానికి

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన అంటే సుంద‌రానికి ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. నాని, న‌జ్రియా న‌జీమ్ జంట‌గా న‌టించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ఎలా ఉందో స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:
అత్యంత సనాతన హిందూ కుటుంబానికి చెందిన వ్య‌క్తి సుందర్ (నాని). మ‌నోడిని త‌ల్లిదండ్రులు చాలా జాగ్రత్త‌గా పెంచుతుంటారు. అయితే క్రిస్టియ‌న్ కుటుంబానికి చెందిన లీల ( న‌జ్రియా) త‌న‌కంటూ ఓ గుర్తింపు కోసం పాకులాడే మ‌నిషి. అటు హిందూ కుటుంబానికి చెందిన నాని, ఇటు క్రిస్టియ‌న్ లీల ప్రేమ‌లో ప‌డిన‌ప్పుడు వారి ప్రేమ‌కు ఎదురైన అడ్డంకులు ఏంటి ? చివ‌ర‌కు వీరి పెళ్లి ఎలా ? జ‌రిగింది ? అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

విశ్లేష‌ణ :
దర్శకుడు వివేక్ ఆత్రేయ సుందర్ – లీల పాత్ర‌ల ప‌రిచ‌యం.. వారి కుటుంబ నేప‌థ్యాలు.. వారి కుటుంబ విశ్వాసాలు.. వారి సంప్ర‌దాయాల గురించి చెప్పేందుకు చాలా టైం తీసుకోవ‌డంతో ఫ‌స్టాఫ్ స్లోగా స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా ట్రైల‌ర్‌లో సినిమా క‌థ ఏంట‌న్న‌ది చెప్పేయ‌డంతో ఫ‌స్ట్ 30 నిమిషాలు మ‌రీ సాగ‌దీసిన‌ట్టుగా ఉంటుంది. చిన్న‌ప్పుడు పాఠ‌శాల‌లో నాటకాన్ని చాలా సార్లు తీసుకురావ‌డం ప్రేక్ష‌కుల‌ను గంద‌ర‌గోళానికి గురి చేస్తుంది.

క‌థ‌లోకి ప్ర‌వేశించాక సినిమా ఆస‌క్తిగా ముందుకు సాగుతుంది. ద‌ర్శ‌కుడు వివేక్ మతాంత‌ర వివాహానికి సంబంధించిన క‌థ‌లో మ‌త సంప్ర‌దాయాలు గుడ్డిగా అనుస‌రిస్తే ప్రేమికుల‌కు ఎలాంటి ఇబ్బందులు వ‌స్తాయ‌న్న‌ది సునిశితంగా హాస్యంగా ప్ర‌జెంట్ చేశాడు. కుటుంబం, ప్రేమ మ‌ధ్య స‌మ‌తుల్య‌త‌ను చ‌క్క‌గా బ్యాలెన్స్ చేసుకున్నాడు. సినిమాలో కామెడీతో పాటు ల‌వ్‌స్టోరీ, ఎమోష‌న‌ల్ చ‌క్క‌గా వ‌ర్క‌వుట్ అయ్యాయి. కొన్ని సీన్లు లెన్దీగా ఉన్నా.. రొటీన్ కామెడీ సీన్లు ఉన్నా కూడా ఎంగేజింగ్‌గా ఉంది. ఎమోష‌న‌ల్ సీన్లు బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయి. నాని, న‌జ్రియా జోడీ ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యింది.

నాని తన సుందర్ పాత్రతో ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌ను గెలుచుకున్నాడు. మ‌త‌ప‌ర‌మైన సంప్ర‌దాయాల మ‌ధ్య ఇరుక్కున్న‌ప్పుడు అత‌డి న‌ట‌న బాగుంది. సుందర్ మరియు సుందర్ నాన్న (నరేష్) మధ్య ఎపిసోడ్స్ బాగా వచ్చాయి. మిగిలిన న‌టులు కూడా పాత్ర‌ల వ‌ర‌కు మెప్పించారు. ఫ‌స్టాఫ్ బాగుంది.. సెకండాఫ్ చాలా బాగుంద‌నే చెప్పాలి. క్లైమాక్స్ సూప‌ర్బ్‌. ఒక్క ఫ‌స్టాఫ్‌లో స్లో నెరేష‌న్ మాత్ర‌మే కాస్త ఇబ్బంది పెడుతుంది. ఎడిటింగ్ ఫ‌స్టాఫ్‌లో కొన్ని సీన్ల‌కు ట్రిమ్ చేస్తే బాగుండేది. వివేక్‌ సాగర్‌ చక్కటి బీజీఎం అందించాడు. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. ఓవ‌రాల్‌గా బ‌ల‌మైన రైటింగ్‌, ఫ్రెష్ స్క్రీన్ ప్లేతో సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈజీగానే పాస్ అయిపోతుంది.

ఫైన‌ల్‌గా..
సుంద‌రానికి కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమా

సుంద‌రానికి రేటింగ్‌: 3 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news