Moviesబాల‌య్య ఫ్యాన్స్ ఊహించ‌ని కిక్‌రా ఇది...!

బాల‌య్య ఫ్యాన్స్ ఊహించ‌ని కిక్‌రా ఇది…!

నందమూరి బాలకృష్ణతో సినిమా తీసే దర్శకుడెవరైనా ఆయనకు వీరాభిమాని అని వారు తీసే సినిమాలే చెబుతున్నాయి. ఇటీవల కాలంలో బాలయ్యతో ఎంత గ్యాప్ తర్వాత సినిమా తీసిన హిట్ గ్యారెంటీ రాసి పెట్టుకోండి.. అనేలా తీస్తున్నాడు మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను. ఇప్పటివరకు బాలయ్యతో మూడు సినిమాలు తీస్తే ఆ మూడు సినిమాలు అటు బాలయ్యకు ఇటు బోయపాటికి మైల్ స్టోన్ మూవీలా నిలిచాయి. సింహ, లెజెండ్ ఇటీవల వచ్చిన అఖండ. బాలయ్యతో సినిమా అంటే మాస్ పల్స్ ఒక్కటే తెలిస్తే సరిపోదు. బాలయ్యను ఎలాంటి పాత్రలో చూపించాలో ముందు బాగా గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి.

ఆయన పాత్రను డిజైన్ చేయడానికే చాలా సమయం పడుతుంది. అది సాధ్యపడాలంటే ఖచ్చితంగా ఆ దర్శకుడు బాలయ్య వీరాభిమానుల్లో ఒకరై ఉండాలి. అలాంటి అభిమాని అయితేనే రికార్డులన్నీ తిరగరాసే సినిమాను బాలయ్యతో తీయగలడు. ఆ లిస్ట్‌లో ఇప్పుడు మరో మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని చేరాడు. ఆయనకు బాలయ్య అంటే ఎంతటి ప్రత్యేకమైన అభిమానం ఉందో జస్ట్ ఎన్‌బీకే 107 ఫస్ట్ హంట్‌తోనే తెలిసిపోయింది.

బాలయ్య బర్త్ డేను పురస్కరించుకొని తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను వదిలారు. గతంలో వి వి వినాయక్ దర్శకత్వంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన చెన్నకేశవ రెడ్డిలోని టైటిల్ పాత్ర తరహాలో ఎన్‌బికె 107 లోని పాత్ర కనబడుతోంది.

అయితే, ఈ సినిమాలో బాలయ్య పాత్ర దానికి నాలుగురెట్లుంటుందని తాజా టీజర్‌తో దర్శకుడు గోపీచంద్ మలినేని హింట్ ఇచ్చాడు. తన మార్క్ మేకింగ్ స్టైల్‌కు బాలయ్య మార్క్ వీర లెవల్ మాస్ యాక్షన్ ఈ సినిమాలో ఉంటుందని బాలయ్య అభిమానులకే కాక సినీ ప్రేమికులందరికీ ఇది మాసీవ్ కిక్కే.

టీజర్‌లోని ‘మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్’ ‘భయం నా బయోడేటాలోనే లేదురా బోషిడికే’ ‘నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలీదు నా కొడకల్లారా..’ లాంటి డైలాగులే చెబుతున్నాయి. ఇలాంటి సినిమా అఖండ తర్వాత పడుతుందని నందమూరి అభిమానులు కూడా ఊహించి ఉండరు. మొత్తానికి బాలయ్యకు గోపీచంద్ మలినేని భారీ హిట్ ఇవ్వబోతున్నాడు..ఇది ఫిక్స్ ..బాలయ్య ఫ్యాన్స్ రాసిపెట్టుకోండి..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news