Moviesబాల‌య్య‌తో కాజ‌ల్ వ‌దులుకున్న ఆ 2 సినిమాలు.. వాటి రిజ‌ల్ట్ ఇదే...!

బాల‌య్య‌తో కాజ‌ల్ వ‌దులుకున్న ఆ 2 సినిమాలు.. వాటి రిజ‌ల్ట్ ఇదే…!

న‌ట‌సింహం బాల‌కృష్ణ త‌న కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్ల‌తో న‌టించారు. ఇప్పుడు అంటే కాస్త ఏజ్ బార్ అవ్వ‌డంతో బాల‌య్య ప‌క్క‌న స‌రైన హీరోయిన్ల‌ను సెట్ చేయ‌డం ద‌ర్శ‌కుల‌కు క‌త్తిమీద సాము అయ్యింది. బాల‌య్య లెజెండ్ నుంచి కొంద‌రు హీరోయిన్ల‌ను రిపీట్ చేస్తూ సినిమాలు చేసుకుంటూ వ‌చ్చాడు. సోనాల్ చౌహాన్‌, రాధికా ఆఫ్టే, శ్రియా, న‌య‌న‌తారతోనే రెండు, మూడేసి సార్లు న‌టించాడు. అయితే ఇప్పుడు సీనియ‌ర్ హీరోల‌కు మంచి ఆప్ష‌న్‌గా మారిన కాజ‌ల్ అగ‌ర్వాల్ – బాల‌య్య కాంబోలో మాత్రం ఒక్క సినిమా కూడా రాలేదు.

బాల‌య్య – కాజల్ కాంబినేష‌న్ సెట్ చేసేందుకు రెండు ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. బాల‌య్య కెరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన 100వ సినిమా కోసం ముందుగా చాలా మంది హీరోయిన్ల పేర్లు ప‌రిశీలించారు. ఇది చారిత్రాత్మ‌క సినిమా కావ‌డంతో హీరోయిన్ పాత్ర‌కు స్కోప్ ఉంది. అందుకే కాజ‌ల్‌ను అడిగారు. అయితే ఈ సినిమాలో ఓ బిడ్డ‌కు త‌ల్లిగా కూడా క‌న‌ప‌డాల్సి రావ‌డంతో కాజ‌ల్ ఈ పాత్ర‌లో న‌టించేందుకు ఆస‌క్తి చూప‌లేద‌ట‌. ఆ త‌ర్వాత క్రిష్ శ్రియను తీసుకున్నారు.

అదే టైంలో కాజ‌ల్‌కు చిరు 150వ సినిమాలో కూడా ఛాన్స్ రావ‌డంతో శాత‌క‌ర్ణి చేయ‌క‌పోవ‌డానికి మ‌రో కార‌ణం. బాల‌య్య కెరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 100వ సినిమాగా వ‌చ్చిన శాత‌క‌ర్ణి సూప‌ర్ హిట్ అయ్యింది. ఇక బాల‌య్య – పూరి కాంబోలో వ‌చ్చిన పైసా వ‌సూల్ సినిమాలో కూడా కాజ‌ల్ పేరు హీరోయిన్‌గా అనుకున్నారు. కాజ‌ల్‌కు పూరితో మంచి అనుబంధం ఉంది. ఆ సినిమాలో కాజ‌ల్‌కు బాల‌య్య ప‌క్క‌న న‌టించాల‌ని అనుకుంది.

అప్పుడు సౌత్‌తో పాటు బాలీవుడ్‌లో ఓ సినిమాలో బిజీగా ఉండ‌డంతో రెండోసారి కూడా ఛాన్స్ వ‌దులుకుంది. పూరి మాత్రం ఎలాగైనా బాల‌య్య – కాజ‌ల్ జోడీ సెట్ చేయాల‌ని అనుకున్నాడు. అయితే అప్పుడు కూడా కాజ‌ల్ బిజీ ఉండ‌డంతో మ‌రోసారి శ్రీయ‌నే బాల‌య్య‌కు జోడీగా మెయిన్ హీరోయిన్‌గా సెట్ చేశారు. ఆ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు.

ఇక ప్ర‌స్తుతం కాజ‌ల్ పెళ్లి చేసుకుని ఓ బిడ్డ‌కు త‌ల్లి కూడా అయిపోయింది. మ‌ళ్లీ ఆమె సినిమాల్లో ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందో ? బాల‌య్య – కాజ‌ల్ జోడీ ఎప్పుడు సెట్ అవుతుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news