Moviesచిరంజీవితో నగ్మా డీల్ లిప్ లాక్... ఈ సీన్ ఎందుకు మాయం...

చిరంజీవితో నగ్మా డీల్ లిప్ లాక్… ఈ సీన్ ఎందుకు మాయం చేశారంటే..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఘరానా మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. చిరంజీవి అంటే హీరోయిన్స్‌తో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ అదిరిపోతుంది. ఇక రాఘవేంద్ర రావు సినిమా అంటే హీరోయిన్ నాభి, పూలు పళ్ళు, పాలు లాంటివి చాలా కామన్. అయితే, ఆయన ఏ సినిమాలో అయినా ఓ రొమాంటిక్ సాంగ్ పెట్టాల్సిందే. అందులో హీరోయిన్ బొడ్డుపై ఏదో ఒకటి విసరాల్సిందే.

చెప్పాలంటే దర్శకేంద్రుడికి అదొక సెంటిమెంట్ అయిపోయింది. సినిమా హిట్ అనే దానికి ఇదీ ఒక ప్రత్యేక కారణం అని చెప్పాలి. ఇక ఘరానా మొగుడు సినిమాలో హీరోయిన్‌గా నగ్మాను తీసుకోవాలనుకున్నప్పుడు అంత ఈజీగా అమ్మడు డేట్స్ ఇవ్వలేదు. కన్నడ, భోజ్‌పురి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నగ్మా అప్పటికే తెలుగులోనూ సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్‌గా మారింది.

సుమన్ సరసన చిన్నల్లుడు సినిమా చేస్తున్న సమయంలో నగ్మా గురించి తెలుసుకున్న రాఘవేంద్ర రావు ఏకంగా ఆమె కోసం సెట్‌కే వెళ్ళిపోయారు. అక్కడ సాంగ్ షూటింగ్ జరుగుతుంది. వెంటనే నగ్మాను తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని డిసైడయ్యాడు. అయితే, అప్పటికే నగ్మా ఓ హిందీ సినిమా చేస్తూ చాలా బిజీగా ఉంది. ఘరనా మొగుడు సినిమా కోసం డేట్స్ అడిగితే సర్దుబాటు చేయలేన‌ని కూడా చెప్పింది. అయినా సరే ఎలాగైనా ఒప్పించి సినిమాకు లాక్ చేశారు.

ఇక సినిమాలో చిరంజీవి – నగ్మా మధ్య ఒక లిప్ లాక్ పెట్టాలని దర్శకేంద్రుడు ఫిక్సైయ్యాడు. కానీ, అందుకు నగ్మా ససేమిరా అన్నది. చాలా ప్రయత్నం చేశాక గానీ, ఎస్ అనలేదు. అది కూడా చిరు కలగజేసుకొని ఒప్పించాడు. ఇష్టం లేకపోయినా చిరంజీవితో ముద్దు సన్నివేశంలో నటించింది. అయితే, నగ్మా ఇబ్బందిని గమనించి సీన్ తీసినా కూడా సినిమాలో లేకుండా ఫైనల్ కట్‌లో తీసేశారు.

కానీ, ఆ సీన్ ఇప్పుడు ఉంటే బావుండేదని హీరో దర్శక నిర్మాతలతో పాటు హీరోయిన్ నగ్మా కూడా అనుకున్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి సరసన నగ్మా ముగ్గురు మొనగాళ్ళు లాంటి సినిమాలు చేసింది. అంతేకాదు, దర్శకేంద్రుడు రూపొందించిన మేజర్ చంద్రకాంత్ లాంటి చాలా సినిమాలలో హీరోయిన్‌గా నటించి అందాలు ఆరబోసింది. నగ్మాకు హిట్ ఇచ్చిన దర్శకులలో రాఘవేంద్ర రావు గురించి నగ్మా ఇప్పటికీ ప్రత్యేకంగా చెప్పుకుంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news