Moviesప్రభాస్‌ను మాయ చేసేందుకు శృతి స్కెచ్‌లు మామూలుగా లేవుగా...!

ప్రభాస్‌ను మాయ చేసేందుకు శృతి స్కెచ్‌లు మామూలుగా లేవుగా…!

అందాల తార శృతీహాస‌న్‌కు టాలీవుడ్‌లో సెకండ్ ఇన్సింగ్స్ బాగా క‌లిసొచ్చిది. ఇప్పుడు శృతి ప‌ట్టింద‌ల్లా బంగారం అయిపోతోంది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడే లండ‌న్ భాయ్‌ఫ్రెండ్ మ‌త్తులో ప‌డి డేటింగ్ చేసిన శృతి తెలుగు సినిమాల‌ను నిర్ల‌క్ష్యం చేసింది. బాలీవుడ్‌కు చెక్కేసి అక్క‌డ భాయ్‌ఫ్రెండ్‌తో ఉంటూ ఒక‌టి రెండు బాలీవుడ్ సినిమాలు చేస్తూ కాల‌క్షేపం చేసింది. ఆ త‌ర్వాత భాయ్‌ఫ్రెండ్‌తో స్ప‌ర్థ‌ల నేప‌థ్యంలో బ్రేక‌ప్ చెప్పేయ‌డం.. అక్క‌డ ఛాన్సులు రాక తిరిగి సౌత్‌కు వ‌చ్చినా ఇక్క‌డ ప‌ట్టించుకునే వాళ్లు లేక ఫేడ‌వుట్ అయిపోయింది.

అలాంటి టైంలో ప‌వ‌న్ కాట‌మ‌రాయుడు, వ‌కీల్‌సాడ్ రెండు సినిమాల్లో ఛాన్సులు ఇచ్చి శృతిని ఆదుకున్నాడు. క‌ట్ చేస్తే సెకండ్ ఇన్సింగ్స్‌లో మాత్రం శృతి దూసుకుపోతోంది. ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ స‌లార్ సినిమాలో న‌టిస్తోన్న ఆమె టాలీవుడ్ సీనియ‌ర్ హీరోలు బాల‌కృష్ణ‌, చిరంజీవి ప‌క్క‌న కూడా హీరోయిన్‌గా చేస్తోంది. ఇలా వ‌రుస అవ‌కాశాల‌తో శృతీ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది.

అంద‌రూ ఫేడ‌వుట్ అయిపోయింద‌నుకున్న అమ్మాయి ఇప్పుడు ఇంతలా విజృంభిస్తుండ‌డంతో అంద‌రూ షాక్ అవుతున్నారు. మ‌రో విశేషం ఏంటంటే పాన్ ఇండియా ప్రాజెక్టులో ప్ర‌భాస్‌తో క‌లిసి న‌టిస్తోన్న ఈ అమ్మ‌డు ఇప్పుడు ప్ర‌భాస్‌ను ఆకాశానికి ఎత్తేస్తోంది. త‌న‌కు బాగా ఇష్ట‌మైన ద‌ర్శ‌కుల్లో ప్ర‌శాంత్ నీల్ కూడా ఒక‌రు అని.. ఆయ‌న సినిమాల్లో క‌థ‌, క‌థ‌నాలు ఎంతో బాగుంటాయ‌ని చెప్పుకువ‌చ్చింది.

ప్ర‌స్తుతం స‌లార్‌లో తాను ప్ర‌భాస్ ప‌క్క‌న ఆద్య పాత్ర‌లో న‌టిస్తున్నాన‌ని. ఈ పాత్ర ఎంగో ఎగ్జైటింగ్‌గా ఉంటుంద‌ని.. ఈ పాత్ర గురించి ఇంత‌కంటే ఇప్పుడే ఏం చెప్ప‌లేన‌ని చెప్పింది. ఇక ప్ర‌భాస్‌తో వ‌ర్క్ చేయ‌డం నిజంగా చాలా ల‌క్కీ అని.. ఆయ‌న గురించి ఓ మాట‌లో చెప్పాలంటే సూప‌ర్ అంటూ చెపుతోంది. శృతి మాట‌లు వింటోన్న సినీ జ‌నాలు మొత్తానికి ప్ర‌భాస్‌ను మాయ చేసే ప‌నిలో ఆమె బిజీగా ఉంద‌ని చెవులు కొరుక్కుంటున్నారు.

ఇక కేజీయ‌ఫ్ 2 లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత ప్ర‌భాస్ స‌లార్ డైరెక్ట్ చేస్తున్నాడు ప్ర‌శాంత్ నీల్‌. త్వ‌రలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ కానుండగా వచ్చే సమ్మర్ కు స‌లార్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news