Moviesఇండస్ట్రీకి మరో వారసుడు..దిల్ రాజుకి కొడుకు పుట్టాడోచ్..?

ఇండస్ట్రీకి మరో వారసుడు..దిల్ రాజుకి కొడుకు పుట్టాడోచ్..?

యస్..తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ..టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు మరోసారి తండ్రి అయ్యాడంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు తన మొద‌టి భార్య చ‌నిపోవ‌డంతో రెండో పెళ్లి చేసుకున్న సంగ‌తి మన అంద‌రికీ తెలిసిందే. దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత. అయితే, దిల్ రాజుకు మొదట భార్యకు ఓ కుమార్తె ఉంది. ఆమె పెళ్ళి చేసుకుమి ఇప్ప‌టికే ఒక బిడ్డ‌కు తల్లి కూడా అయ్యింది. అయితే, తనకు ఓ తోడు కావాలంటూ..దిల్ రాజు ఏజ్ అయిపోయిన సరే మళ్ళీ రెండో పెళ్ళి చేసుకున్నాడు.

 

లాక్ డౌన్ సమయంలో సైలెంట్ గా రెండో పెళ్ళి చేసుకున్నారు. కూతురు, పెద్దల సలహాతో తమ కుటుంబానికి ముందు నుంచీ పరిచయమున్న వైఘా రెడ్డి (తేజస్విని)ని పెళ్ళి చేసుకున్నారు. అయితే, ఈ దంపతులకు రీసెంట్ గా కొడుకు పుట్టిన్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట బాగా వైరల్ అవుతుంది.

సినీ ఇండస్ట్రీలో వారసులు అంటే ఎంత విలువ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇన్నాళ్లు తనకు వారసుడు ఎవరూ లేరని బాధపడిన దిల్ రాజు కు ఈ రోజుతో ఆ లోటు తీరిపోయింది. దిల్ రాజు కి వారసుడు జన్మించడంతో ఆ ఇంట సంబరాలు అంబరాన్నంటాయి అంటూ సినీ వర్గాలల్లో ఓ వార్త యమ ట్రెండింగ్ మారింది. అయితే, ఇప్పటీ వరకు దిల్ రాజు దీని పై అఫిషీయల్ ప్రకటన చేయలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news