Moviesవావ్... స‌మంత బెస్ట్ ఫ్రెండ్‌కు ట్విన్స్ పుట్టారు... పేర్లు సూప‌ర్‌గా ఉన్నాయే..!

వావ్… స‌మంత బెస్ట్ ఫ్రెండ్‌కు ట్విన్స్ పుట్టారు… పేర్లు సూప‌ర్‌గా ఉన్నాయే..!

టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటుడు మరియు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రాహుల్ ర‌వీంద్ర‌న్ కేవ‌లం న‌టుడు మాత్ర‌మే కాదు.. ఓ ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు కూడా. న‌టుడిగా కెరీర్ స్టార్టింగ్ చేసి త‌న‌లో ఉన్న ర‌చ‌యిత‌కు ప‌దును పెట్టుకుని.. ఆ త‌ర్వాత మెగాఫోన్ ప‌ట్టాడు. రాహుల్ ర‌వీంద్ర‌న్ అందాల రాక్ష‌సి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా చి ల సౌ సినిమాతో మంచి మార్కులు వేయించుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఏకంగా కింగ్ నాగార్జున‌తో మ‌న్మ‌థుడు 2 సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా కొట్టేశాడు. అయితే ఈ సినిమా ఘోరంగా ప్లాప్ అయ్యింది. ఇక రాహుల్ భార్య ప్ర‌ముఖ సింగ‌ర్ చిన్మ‌యి. ఈ దంప‌తులు ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటారు.

చిన్మ‌యి సింగ‌ర్ మాత్ర‌మే కాకుండా ప్ర‌ముఖ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ కూడా..! క్రేజీ హీరోయిన్ స‌మంత‌కు చిన్మ‌యే త‌న మ‌ధుర గాత్రం అందిస్తుంది. స‌మంత‌కు చిన్మ‌యి బెస్ట్ ఫ్రెండ్‌. ఇప్పుడు ఈ దంపతుల జీవితంలో ఓ హ్యాపీ మూమెంట్ వ‌చ్చింది. ఈ దంప‌తుల‌కు క‌వ‌ల పిల్ల‌లు పుట్టారు. దీంతో వీరి ఇంట్లో ఎక్క‌డా లేని ఆనందం నెల‌కొంది. దీంతో వీరు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

ఈ హ్యాపీ మూమెంట్‌ను రాహుల్ ర‌వీంద్ర‌న్ సోష‌ల్ మీడియాలో పంచుకుని వారి పిల్ల‌ల పేర్లను కూడా షేర్ చేశారు. ఈ పేర్లు చాలా సూప‌ర్‌గా ఉన్నాయి. దృప్త, శర్వాస్ మా జీవితంలో ఎప్ప‌ట‌కీ కొత్త‌గా నిలిచిపోయే విశ్వంలోకి వ‌చ్చార‌ని.. వారి చిట్టి చేతుల్లో త‌న చేతులు క‌లిపి ఆ ఫొటోల‌ను షేర్ చేశాడు. దీంతో వారి ఫాలోవ‌ర్స్‌తో పాటు నెటిజ‌న్లు ఇప్పుడు వారికి అభినంద‌న‌లు తెలుపుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news