Moviesమోక్ష‌జ్ఞ ఎంట్రీ మ‌రికాస్త లేట్ ... కార‌ణం ఇదేనా...?

మోక్ష‌జ్ఞ ఎంట్రీ మ‌రికాస్త లేట్ … కార‌ణం ఇదేనా…?

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు.. ఈ వంశంలో మూడో త‌రం హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతోన్న నంద‌మూరి మోక్ష‌జ్ఞ వెండితెరంగ్రేటం మ‌రికొద్ది రోజులు ఆల‌స్యం అయ్యేలా ఉంది. అప్పుడెప్పుడో 2016లో వ‌చ్చిన బాల‌య్య 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా టైం నుంచే మోక్ష‌జ్ఞ సినిమా తెరంగ్రేటం ఉంద‌ని పుంకాను పుంకాలుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే ఇప్ప‌ట‌కీ ఈ సినిమా ప‌ట్టాలు ఎక్క‌లేదు. మ‌రోవైపు నాగార్జు, చిరంజీవి త‌న‌యుడు సినిమాల్లోకి వ‌చ్చి ఏళ్ల‌కు ఏళ్లు దాటుతోంది. వాళ్ల కెరీర్ ఎలా ఉన్నా.. వాళ్ల‌ను హీరోలుగా జ‌నాలు అయితే అంగీక‌రించేశారు.

ఇంకా మోక్షు సినిమాల్లోకి రాక‌పోవ‌డంతో నంద‌మూరి అభిమానులు కాస్త డిజ‌ప్పాయింట్‌గానే ఉన్నారు. మోక్షు డెబ్యూ మూవీ కోసం చాలా మంది ద‌ర్శ‌కుల పేర్లు వినిపించాయి. రాజ‌మౌళి అన్నారు.. పూరి జ‌గ‌న్నాథ్‌, అనిల్ రావిపూడి అన్నారు.. అయితే దీనిపై బాల‌య్య క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే బాల‌య్య మోక్షు సినిమా తెరంగ్రేటం ఎప్పుడు ఉంటుందో ? చెప్ప‌క‌పోయినా త్వ‌ర‌లోనే ఉంటుంద‌ని మాత్ర‌మే చెపుతున్నాడు.

మ‌రోవైపు అమెరికాలో డ్యాన్సులు, ఫైట్స్‌తో పాటు న‌ట‌న‌లో శిక్ష‌ణ పొందుతున్నాడు. కొన్ని క‌థలు అయితే బాల‌య్య విని చిన్న చిన్న మార్పులతో ఓకే చేస్తున్నా.. ఇంకా మోక్షు ఎంట్రీకి టైం ప‌ట్టేలా ఉంది. పూరి జ‌గ‌న్నాథ్ చెప్పిన ఓ లైన్ అయితే బాల‌య్య‌కు బాగా న‌చ్చింద‌ట‌. అయితే మోక్షు ట్రైనింగ్‌కు ఇంకాస్త టైం ప‌ట్టేలా ఉండ‌డంతో ఈ సినిమా ఎప్పుడు ఉంటుందో తెలియ‌ట్లేదు.

తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన మోక్షు స్టిల్ చూస్తే మ‌నోడు ఇంకా బొద్దుగానే ఉన్న‌ట్టు క‌న‌ప‌డుతోంది. ర‌ఫ్ గెడ్డంతో మాసీవ్ లుక్‌లో ఉన్నా…. చాలా లావుగా ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నాడు. తొలి సినిమా ప‌ట్టాలెక్కే టైంకు మోక్ష‌జ్ఞ స్లిమ్ లుక్‌లోకి రావ‌డంతో పాటు కాస్త స‌న్న‌బ‌డాలి. మ‌రి మోక్ష‌జ్ఞ ఈ క‌స‌ర‌త్తులు ఎప్ప‌ట‌కీ పూర్తి చేస్తాడో ? ఎప్పుడు ఫ‌స్ట్ సినిమా ప‌ట్టాలు ఎక్కే ప్ర‌క‌ట‌న వ‌స్తుందో ? స‌స్పెన్సే.

మోక్షు సంగ‌తి ఎలా ఉన్నా బాల‌య్య ఆరు ప‌దుల వ‌య‌స్సులో కూడా వ‌రుస పెట్టి జెట్ రాకెట్ స్పీడ్‌తో సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. మ‌లినేని గోపీ సినిమా ఆ వెంట‌నే అనిల్ రావిపూడి… ఆ త‌ర్వాత బోయ‌పాటి శ్రీను, పూరి జ‌గ‌న్నాథ్ సినిమాల‌ను లైన్లో పెట్టేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news