Moviesవామ్మో..20 కోట్లా..భర్త కోసం నయన్ సర్ప్రైజ్ గిఫ్ట్ చూస్తే కళ్లు జిగేల్...?

వామ్మో..20 కోట్లా..భర్త కోసం నయన్ సర్ప్రైజ్ గిఫ్ట్ చూస్తే కళ్లు జిగేల్…?

ఎట్టకేలకు కోలీవుడ్ లవ్ బార్డ్స్..ఒక్కటి అవ్వబోతున్నారు. ఇన్నాళ్ళు ప్రేమ పావురాలు లా తిరిగిన ఈ జంట రేపటి నుండి భార్య భర్తలు లా లోకానికి కనిపించబోతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార..మరి కొద్ది గంటల్లోనే మిసెస్ విగ్నేశ్ సివన్ గా మారబోతుంది. ఇన్నాళ్ళు ప్రేమలో ఉన్న వీరు..ఏనాడు కూడా వాళ్ళ లవ్ విషయం అఫిషియల్ గా చెప్పలేదు. చేతిలో చెయ్యి వేసుకుని తిరగారే కానీ..ఎక్కడ కూడా మేం ప్రేమించుకుంటున్నాం అని చెప్పనేలేదు.

కానీ, వీళ్ళ బీహేవియర్ బట్టి జనాలకి అర్ధమైపోయింది వీళ్లు ప్రేమలో ఉన్నారని. కానీ, ఇది వరకే నయన్ ..ఖాతలో బ్రేకప్ లవ్ స్టోరీలు ఉండటంతో..ఈ ప్రేమ ఎంతవరకు నిలబదుతుందో అనుకున్నారంతా. కానీ, ఫైనల్లీ ఆమె తన లవ్ ను నిలబెట్టుకుంది. ప్రేమించిన అబ్బాయినే పెళ్లాడేందుకు మూహుర్తం ఫిక్స్ చేసుకుంది. సౌత్​ ఇండస్ట్రీలో లేడీ సూపర్​స్టార్​గా నయనతార, సక్సెస్​ఫుల్​ డైరెక్టర్​గా విఘ్నేష్​ శివన్​ గుర్తింపు పొందిన వీరిద్దరి వివాహంపై జూన్ 9న మహాబలిపురంలో జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులు పూర్తి అయ్యాయి.


అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనుందని సమాచారం. టాలీవుడ్ నుండి చిరంజీవి, బాలయ్య,వెంకటేశ్, నాగార్జున పెళ్లికి వెళ్లబోతున్నత్లు తెలుస్తుంది. అయితే, విగ్నేశ్ తన మెడలో తాళ్లి కట్టాక నయన్ భర్తకు ఓ స్వీట్ సర్ ప్రైజ్ రెడీ చేసిందట. దాదాపు 20 కోట్ల వ్యయంతో ఇష్టంగా కట్టించుకున్న ఇళ్లుని విగ్నేశ్ కి గిఫ్ట్ గా ఇవ్వబోతుందట నయన్.

అంతేకాదు, ఇద్దరు భార్య భర్తలు గా మారిన తరువాత ఆ ఇంట్లోకే వెళ్లి కొత్త కాపురం పెట్టబోతున్నారట ఈ జంట. ఇక నయంకు కూడా విగ్నేశ్ గిఫ్ట్ రెడి చేసిన్నత్లు తెలుస్తుంది. దాదాపు 3 కోట్లు విలువైన బంగారు ఆభరణాలను..భార్య కి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాడట. అన్నింటికన్నా స్పెషల్ ఏమిటంటే..నయన్ కోసమే సపరేటు గా ఆర్డర్ చేసి..ఓ డైమెండ్ రింగ్ ను ఆమె కు చిరకాలం గుర్తుండిపోయేలా ఇవ్వనున్నాడట విగ్నేశ్.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news