Moviesపెళ్లి అనేది ఓ ఫెయిల్యూర్‌.. నాలుగో పెళ్లిపై న‌రేష్ కాంట్ర‌వ‌ర్సీ డైలాగ్స్‌..!

పెళ్లి అనేది ఓ ఫెయిల్యూర్‌.. నాలుగో పెళ్లిపై న‌రేష్ కాంట్ర‌వ‌ర్సీ డైలాగ్స్‌..!

సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌, మ‌రో సీనియ‌ర్ న‌టి పవిత్రా లోకేష్ పెళ్లి గురించి గ‌త వారం రోజులుగా సోష‌ల్ మీడియా మార్మోగిపోతోంది. న‌రేష్‌కు ఇప్ప‌టికే మూడు పెళ్లిళ్లు జ‌రిగాయి. మూడో భార్య ర‌మా ర‌ఘుప‌తితో అధికారికంగా విడాకులు వ‌చ్చాయా ? లేదా ? అన్న‌ది అయితే క్లారిటీ లేదు. ఇక ప‌విత్రా లోకేష్‌కు క‌న్న‌డ న‌టుడితో పెళ్ల‌య్యింది. మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో దూరంగా ఉంటోంది. ఆమెకు ఇంకా విడాకులు అయితే రాలేదు. ఆమెకు విడాకులు వ‌చ్చిన వెంట‌నే న‌రేష్ – ప‌విత్రా లోకేష్ పెళ్లి చేసుకుంటార‌న్న ప్ర‌చార‌మే న‌డుస్తోంది. అదే జ‌రిగితే ప‌విత్ర‌కు రెండో పెళ్లి.. న‌రేష్‌కు నాలుగో పెళ్లి అవుతుంది.

వీరిద్ద‌రు ఇప్ప‌టికే స‌హ‌జీవ‌నం కూడా చేస్తున్నార‌ని.. త్వ‌ర‌లోనే త‌మ బంధాన్ని పెళ్లి బంధంగా కూడా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే ఇండ‌స్ట్రీ వాళ్లు కూడా అంటున్నారు. అయితే ఈ వార్త‌లు బాగా వైర‌ల్ అవుతుండ‌డంతో న‌రేష్ స్పందించారు. తాను నాలుగో పెళ్లి చేసుకోవ‌డం లేద‌ని కాని.. తాను స‌హ‌జీవ‌నం చేయ‌డం లేద‌ని కాద‌ని చెప్ప‌కుండా చాలా న‌ర్మ‌గ‌ర్భంగా మాట్లాడారు.

అయితే న‌రేష్ మాట్లాడిన మాట‌లు చూస్తుంటే ప‌విత్రా లోకేష్‌కు ఆయ‌న‌కు ఉన్న బంధం నిజ‌మే ? అన్న అనుమానం రాక‌మాన‌దు. పెళ్లి గురించి న‌రేష్‌ను మీడియా ప్ర‌శ్నిస్తే సినిమా వాళ్లే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటున్నారా ? మిగిలిన వాళ్లు చేసుకోవ‌డం లేదా ? అని ప్ర‌శ్నించారు. సెల‌బ్రిటీల విష‌యాలే బ‌య‌ట‌కు వ‌స్తాయి.. పెళ్లి అనేది ఆట కాదు… జీవితంలో భాగం అని చెప్పారు. పెళ్లి త‌ర్వాత మాన‌సిక క్షోభ అనుభ‌విస్తే త‌ప్ప వేరే పెళ్లి చేసుకోవాల‌న్న నిర్ణ‌యానికి రార‌ని కూడా న‌రేష్ తెలిపారు.

నటుడికి స్థిర‌త్వం ఉండ‌ద‌ని.. తాను నెల‌లో 28 రోజులు షూటింగ్‌లోనే ఉంటాన‌ని.. టైంకు ఇంటికి కూడా రార‌ని.. ఈ జీవితాన్ని అర్థం చేసుకున్న వాళ్లే వాళ్ల‌తో క‌లిసి ఉంటార‌ని న‌రేష్ చెప్పారు. ఈ మోడ్ర‌న్ యుగంలో అస‌లు వివాహ వ్య‌వ‌స్థే త‌ప్ప‌ని కూడా న‌రేష్ వివాదాస్ప‌దంగా మాట్లాడారు. కొంత‌మంది భార్య‌, భ‌ర్త‌లు అయ్యాక నెల రోజుల‌కే విడిపోతుంటే.. మ‌రి కొంద‌రు కోట్లు ఖ‌ర్చు పెట్టి పెళ్లి చేసుకున్నాక కూడా విడిపోతున్నార‌ని చెప్పాడు.

ఇక త‌న జీవితంలో మూడు విడాకుల గురించి కూడా న‌రేష్ మాట్లాడారు. త‌న మొద‌టి భార్య సినిమాయే అని… త‌న సినిమా జీవితం,, షూటింగ్ అర్తం చేసుకున్న వాళ్లే త‌న‌తో క‌లిసి ఉంటార‌ని.. లేని వాళ్లు విడిపోతార‌న్న న‌రేష్‌… తాను వ్య‌క్తిగ‌త జీవితానికి ఎక్కువ స‌మ‌యం కేటాయించ‌క‌పోవ‌డం వ‌ల్లే త‌న‌కు మూడు విడాకులు అయ్యాయ‌ని కూడా చెప్పారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో చాలా జాగ్ర‌త్త‌గా మాట్లాడిన న‌రేష్ తాను ప‌విత్రా లోకేష్‌ను నాలుగో పెళ్లి చేసుకోవ‌డం లేద‌ని కాని ఎక్క‌డా చెప్ప‌లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news