Moviesఎక్స్పెక్ట్ చేసినంత లేదు..ఆ విషయంలో మహేశ్ బాబు సంతోషంగా లేరా..?

ఎక్స్పెక్ట్ చేసినంత లేదు..ఆ విషయంలో మహేశ్ బాబు సంతోషంగా లేరా..?

యస్..ఇప్పుడు ఇదే విషయం నెట్టింట మారు మ్రోగిపోతుంది. జనరల్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే ఇండస్ట్రీలో ఓ పేరుంది.ఏదైన పక్కా ప్లానింగ్ తో ముందుకు దిగుతాడని..క్లీయర్ గా డెసీషన్స్ తీసుకుంటాడని. తన సినిమాల్లో, సినిమాలు చేయ్యడానికి చూస్ చేసుకునే డైరెక్టర్ల విషయంలో మహేశ్ పక్క క్లారిటీగా ఉంటాడు. అయితే, ఎందుకు తెలియదు కానీ, మాటల మాంత్రికుడు మహేశ్ ను ఊహించుకుని రాసుకున్న కధ ఆయనకి నచ్చలేదట.

స్టోరీ లైన్ విని సినిమాకి సైన్ చేసిన మహేశ్..ఫస్ట్ హాఫ్ అంతా మంచిగా అనిపించినా..సెకండ్ హాఫ్ వచ్చేసరికి ..స్టోరీలో కొన్ని సీన్స్ చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయని..అది త్రివిక్రమ్ స్టైల్ కాదని అంటున్నారట. మనకు తెలిసిందే..సర్కారు వారి పాట తో సూపర్ హిట్ అందుకున్న మహేశ్..తన నెక్స్ట్ చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్య క్రమాలు ఎప్పుడు పూర్తి అయ్యాయి. సినిమాలో పూజా హెగ్డే రెండోసారి మహేశ్ తో రొమాన్స్ కి సిద్ధపడ్డింది. క్రేజ్ కాంబో కావడంతో అభిమానులు భారీ అంచనాలే పెట్టుకుని ఉన్నారు.

ఈ క్రమంలోనే ..మహేశ్ తన సినిమా కధ పట్ల సంతృప్తి గా లేరు అనే మాట వినిపిస్తుంది. ప్రస్తుతం విదేశాలల్లో ఉన్న మహేశ్ కు..త్రివిక్రమ్ శ్రీనివాస్ అక్కడే కొన్ని సీన్స్ కి సంబంధించిన షాట్స్ గురించి వివరించారట . ఈ క్రమంలోనే మహేశ్..సెకండ్ హాఫ్ లో స్క్రిప్ట్ లో చేంజస్ చేయ్యండి అంటూ సలహా ఇచ్చారట.

త్రివిక్రమ్ తో మహేశ్ సినిమా అంటే అతడు లాంటి బ్లాక్ బస్టర్ ని ఎక్స్ పెక్ట్ చేస్తారు జనాలు. కానీ, ప్రస్తుతం త్రివిక్రమ్ రాసుకున్న స్క్రిప్ట్ ఆ రేంజ్ లో లేదు అని తెలుస్తుంది. దీంతో మహేశ్..సినిమా లేట్ అయిన పర్లేదు..ఖచ్చితంగా అభిమానులను మెప్పించగలిగేలా ఉండాలి అంటూ టైం ఇచ్చారట. దీని బట్టి చూసుంటే..మహేశ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వాలి అంటే..ఆగస్టు పట్ట్లే ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news