Moviesఎన్టీఆర్ స్ట్రాంగ్ లైన‌ప్ చూస్తే పూన‌కాలే... వామ్మో క్యూలో స్టార్ డైరెక్ట‌ర్లు..!

ఎన్టీఆర్ స్ట్రాంగ్ లైన‌ప్ చూస్తే పూన‌కాలే… వామ్మో క్యూలో స్టార్ డైరెక్ట‌ర్లు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెనెకాల ఇప్పుడు ఎక్కువగా తమిళ దర్శకులందరూ క్యూ కడుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముందునుంచి ఎన్టీఆర్ కి తమిళ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ ఆయన నటించిన సినిమాలు తమిళంతో పాటుగా మిగతా భాషలలోనూ విడుదలై అక్కడ కూడా మంచి కమర్షియల్ సక్సెస్ సాధిస్తున్నాయి. అంతేకాదు, ఎన్టీఆర్ సినిమాలు అక్కడ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేసినా కూడా మార్కెట్ ఆయనకు బాగానే ఉంది.

ఇక ఇటీవల వచ్చిన భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్‌కు పాన్ ఇండియా లెవల్‌లో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే, ఇప్పుడు తారక్‌తో హిందీలో స్ట్రైట్ సినిమాలు నిర్మించేందుకు అక్కడ దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదే క్రమంలో తమిళంలో కూడా స్ట్రైట్ సినిమాలను తారక్‌తో చేయాలని మేకర్స్ రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరో తెలుగులో రెండు భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ రూపొందబోతున్నాయి.

ఈ రెండు సినిమాల అధికారిక ప్రకటనలు వచ్చాయి. అంతేకాదు, ప్రముఖ నిర్మాణ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాలు పాన్ ఇండియ రేంజ్‌లో విడుదల చేయబోతున్నారు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తారక్ రేంజ్ అంట్ స్టామినాకి తగ్గట్టుగా పవర్ ఫుల్ స్టోరీలను రెడీ చేశారు. అయితే, ఇప్పుడు తమిళ స్టార్ డైరెక్టర్స్ కూడా ఎన్టీఆర్ హీరోగా సినిమాలు చేసేందుకు యాక్షన్ తరహా స్క్రిప్టులను రెడీ చేసుకొని అప్రోచ్ అవుతున్నారు.

ఇప్పటికే, ఇటీవల విక్రమ్ సినిమాతో భారీ హిట్ అందుకున్న లోకేష్ కనగ్ రాజ్ తారక్‌కు కథ చెప్పి ఒకే అనిపించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఎప్పటి నుంచో తమిళ క్రేజీ డైరెక్టర్ అట్లీ కూడా రెడీగా ఉన్నాడు. ఇప్పుడు షారుఖ్ ఖాన్‌తో సినిమా చేస్తున్న అట్లీ తర్వాత ప్రాజెక్ట్ తారక్‌తోనే అని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే క్రమంలో వెట్రిమారన్ కూడా జాయిన్ అయ్యాడు.

ఆయన కూడా సాలీడ్ యాక్షన్ స్టోరీతో వచ్చి ఎన్టీఆర్ ని మెప్పించి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే రానున్న రోజుల్లో ఎన్టీఆర్ లైనప్‌లో ఎక్కుగా తమిళ దర్శకుల ఉండబోతున్నారనిపిస్తోంది. ఏదేమైనా కోలీవుడ్‌లో ఎంద‌రో స్టార్ హీరోలు ఉన్నా కూడా వారితో కాకుండా అక్క‌డ స్టార్ డైరెక్ట‌ర్లు అంద‌రూ మ‌న తార‌క్ వెంట ప‌డుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news