MoviesNBK 107పై గూస్ బంప్ న్యూస్‌... నాలుగు లోక‌ల్ ఫైట్లు.. ఓ...

NBK 107పై గూస్ బంప్ న్యూస్‌… నాలుగు లోక‌ల్ ఫైట్లు.. ఓ ఫారిన్ ఫైట్‌..!

నందమూరి బాలకృష్ణ తాజాగా న‌టిస్తోన్న సినిమా షూటంగ్ ఇప్ప‌టికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ లాంటి భారీ హిట్‌తో ఫామ్‌లో ఉన్న బాల‌య్య మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 107వ సినిమా చేస్తున్నాడు. భారీ కాస్టింగ్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. బాల‌య్య‌కు జోడీగా అందాల తార శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కోలీవుడ్ న‌టిమ‌ణి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

 

అటు మైత్రీ మూవీస్ వాళ్లు ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క్రాక్ త‌ర్వాత మ‌లినేని గోపీ డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు అయితే మామూలుగా లేవు. ఈ సినిమా షూటింగ్‌కు బాల‌య్య‌కు క‌రోనా రావ‌డంతో నాలుగైదు రోజులు మాత్ర‌మే బ్రేక్ ప‌డింది. తాజ్ అప్‌డేట్ ప్ర‌కారం బాల‌య్య క‌రోనా నుంచి కోలుకున్నార‌ట‌. మ‌రో వారం రోజుల్లోనే ఈ సినిమా తిరిగి సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

ఈ క్ర‌మంలోనే ఈ సినిమా గురించి అదిరిపోయే గూస్‌బంప్స్ ఉన్న న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేస్తుండ‌గా.. ఫ‌స్టాఫ్‌లో ఓ బాల‌య్య‌, ఇంట‌ర్వెల్ నుంచి రెండో బాల‌య్య పాత్ర ఉంటాయ‌ట‌. సేమ్ అఖండ, లెజెండ్, సింహా స్టైల్లోనే ఇద్ద‌రు బాల‌య్య‌ల పాత్ర‌ల‌ను బోయ‌పాటి డిజైన్ చేశాడంటున్నారు. ఈ సినిమాలో ఫైట్లు మాత్రం క‌ళ్లు చెదిరే రేంజ్‌లో ఉంటాయంటున్నారు.

సినిమాలో నాలుగు లోక‌ల్ ఫైట్ల‌తో పాటు ఓ ఫారిన్ ఫైట్ ఉంద‌ట‌. ఫారిన్ ఫైట్‌లో వ‌చ్చే చేజింగ్‌లు మైండ్ బ్లోయింగ్ రేంజ్‌లో ఉంటాయ‌ని.. మ‌రో ఫైట్ నార్త్ ఇండియా నేప‌థ్యంలో జ‌రిగితే.. మూడు ఫైట్లు రాయ‌ల‌సీమ‌లో జ‌రుగుతాయ‌ని తెలిసింది. ఇక ఇంట‌ర్వెల్ బ్యాంగ్ బాల‌య్య బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమాల రేంజ్‌లోనే అదిరిపోతుంద‌ని తెలుస్తోంది.

సినిమా చూస్తుంటే బాల‌య్య అభిమానులు, మాస్ ప్రేక్ష‌కుల‌కు పూన‌కాలు వ‌చ్చే రేంజ్‌లో ఎలివేష‌న్ల‌ను ప్లాన్ చేశాడ‌ట గోపీచంద్‌. ఏదేమైనా ఇప్పుడు బాల‌య్య ఉన్న ఫామ్‌కు తోడు సినిమాకు హిట్ టాక్ వ‌స్తే చాలు అఖండ రేంజ్‌లో థియేట‌ర్ల‌లో మ‌ళ్లీ మాస్ జాత‌ర త‌ల‌పించ‌డం ఖాయం.

Latest news