Movies“దేవి పుత్రుడు” లోని ఈ పాప కు వరుణ్ సందేశ్ కు...

“దేవి పుత్రుడు” లోని ఈ పాప కు వరుణ్ సందేశ్ కు ఉన్న లింక్ ఇదే..ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!!

సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకి ఏం కొదవ లేదు. ఇండస్ట్రీలో బోలెడు మంది ఉన్నా..మళ్ళీ కొత్త ముఖాలు తెర పై ఎంట్రీ ఇస్తూనే ఉంటాయి. తెలుగు సినిమాల్లో హీరో చిన్నప్పటి కేరెక్టర్ లోనో, హీరో కొడుకుగానో లేక హీరోయిన్ కి తమ్ముడిగానో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు చాలా మందే ఉన్నారు. వాళ్ళంతా బుడ్డోళ్లుగా ఉన్నప్పుడు తొడగొట్టి, మీసం మెలేసి ఇప్పుడు హీరోలుగా మారిపోయారు. టాలీవుడ్ లో కొందరు చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు తమ తమ సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు హీరోలుగా సెటిల్ అయితే మరికొందరు సినిమాల్లోకి రావడానికి కాస్త ఎక్కువగా కష్టపడుతున్నారు. వచ్చిన అవకాశాలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నా..కాని, సక్సెస్ అవ్వడం లేదు.

అలాంటి వారిలో ఈ పాప ఒక్కరు. వెంకటేష్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిన చిత్రం దేవీ పుత్రుడు. సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా..కాన్సెప్ట్ మాత్రం అందరికి కొత్త గా అనిపించింది. ఇంకొంత మందికి నచ్చలేదు. దీంతో 2001లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వెంక‌టేష్ హీరోగా న‌టించగా సౌంద‌ర్య‌, అంజ‌నా జువేరి హీరోయిన్ లుగా న‌టించారు.

మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు. ఫాంటసీ డ్రామా గా వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో భారీ వ్యయంతో రూపొందించబడింది. ఈ సినిమా వల్ల దాదాపు ఎం ఎస్ రాకు 14 కోట్లు నష్టపోయాడని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. ద్వాపర యుగంలో నీట మునిగిన ద్వారక ఈ సినిమా కథకు ఆధారం.

ఈ సినిమా లో ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్ గా వెంకటేష్ ని నేస్తం..అంటూ పిలిచే ఓ పాప ఉంది. అయినా ఆ పాపను ఎలా మర్చిపోగలం. చిన్న వయసులోనే కళ్ళతో బోలెడు ఎక్స్ ప్రేషన్స్ పలికించి..అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ పాప పేరు వేగా తమోటియా. ఈ పాప ఆ సినిమా తరువాత కొన్ని సినిమాల్లో న‌టించింది. అ తరువాత వేగ విదేశాల్లో చ‌దువుకుంది.. మళ్ళీ..పెద్ద అయ్యాక సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

వరుణ్ సందేశ్ తో కలిసి హ్యాపీ హ్యాపీగా అనే సినిమాలో న‌టించింది. కానీ, ఆ సినిమా పెద్ద గా హిట్ అవ్వలేదు. ఆ తరువాత అడపదడపా సినిమాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. ఆమె సౌత్ సినిమాలలో కనిపించకపోయినా పలు బాలీవుడ్ సినిమాలలో నటించారు, చిన్నప్పుడు ఎంత ముద్దుగా క్యూట్ గా ఉందో..ఇప్పుడు అంతే అందంగా తయారైంది వేగా తమోటియా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news