Moviesకేక పెట్టించే కాంబినేష‌న్‌.. చిరంజీవికి బావ‌మ‌రిదిగా నితిన్‌...!

కేక పెట్టించే కాంబినేష‌న్‌.. చిరంజీవికి బావ‌మ‌రిదిగా నితిన్‌…!

సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఎంచుకుంటున్న సినిమాల లిస్ట్ చూస్తుంటే అందులో ఎవరో ఒకరు ఈ జనరేషన్ హీరో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. సినిమా కథను బట్టి అలా జరిగిందా లేదా కావాలని ప్లాన్ చేసుకున్నారో తెలియదు కానీ మొత్తానికి చిరంజీవి రకరకాల కాంబినేష‌న్ల‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆచార్య‌లో తన తనయుడు రామ్‌చ‌ర‌ణ్‌తో కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్దా పాత్రలో కనిపించ‌గా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.

 

ఇక మోహన రాజా దర్శకత్వంలో మలయాళ హిట్ మూవీ లూసీఫర్ కు రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో మరో యంగ్ హీరో సత్యదేవ్ నటిస్తున్నాడు. స‌త్య‌దేవా పాత్ర ఈ సినిమాకు ఎంత ప్లస్ అవుతుందో సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. ఇక బాబీ దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఉన్నాడన్న ప్రకటన అంచనాలు పెంచేసింది.

ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న బోళా శంకర్ సినిమాపై సైతం ఇప్పుడు అదిరిపోయే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా కనిపిస్తున్న కీర్తి సురేష్‌కు జోడీగా యంగ్ హీరో నితిన్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. అంటే చిరుకు బావ‌మ‌రిది రోల్ అన్న‌మాట‌. ఇటీవల కాలంలో యంగ్ హీరోలు అంద‌రూ కూడా ఓ మెమ‌రబుల్ మూవీ కావాల‌ని తాప‌త్ర‌య ప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలోనే పాత్ర ఎక్కువా ? త‌క్కువా ? అన్న దాంతో సంబంధం లేకుండా ఓ పెద్ద హీరోతో స్పేస్ ఉన్న పాత్ర ఏదైనా చేసేందుకు ఓకే చెప్పేస్తున్నారు. ఇది మంచి సంప్ర‌దాయం కూడా. భోళా శంక‌ర్ సినిమాకు ఇప్పటికే చాలా ఎట్రాక్ష‌న్లు ఉన్నాయి. చిరు, త‌మ‌న్నా, కీర్తి సురేష్‌.. ఇప్పుడు నితిన్ కూడా తోడైతే సినిమా అదిరిపోతుంద‌న‌డంలో డౌట్ లేదు.

ఈ క్ర‌మంలోనే నితిన్ కూడా చిరుతో మెమ‌ర‌బుల్ పాత్ర చేశాన‌న్న తృప్తి కోణంలోనే ఈ సినిమాను ఓకే చేశాడంటున్నారు. ప్ర‌స్తుతం చిరు చేస్తోన్న గాడ్ ఫాదర్ తాలూకు పనులన్నీ దాదాపు ఒక కొలిక్కి వ‌చ్చింది. స‌ల్మాన్‌తో చేయాల్సిన ఓ పాట మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. ఇది పూర్త‌యిన వెంట‌నే భోళా శంక‌ర్ సినిమా రీ స్టార్ట్ అవుతుంది.

Latest news