Moviesపెళ్లి చేసుకున్న సంతోషమే లేదు..అలియా బీహేవియర్ పై రణబీర్ షాకింగ్ కామెంట్స్..!!

పెళ్లి చేసుకున్న సంతోషమే లేదు..అలియా బీహేవియర్ పై రణబీర్ షాకింగ్ కామెంట్స్..!!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్..అందాల ముద్దుగుమ్మ అలియా..ఎప్పటినుండొ ప్రేమలో మునిగి తేలిన ఈ జంట..ఎట్టకేలకు ఎన్నో ఆటంకాల తరువాత..ఫైనల్లీ పెళ్ళి చేసుకున్నారు. అయితే. పెళ్లి చేసుకున్న అలియా బీహేవియర్ లో మార్పులు రావడం లేదట. ఇదే విషయాని ఆమె భర్త రణబీర్ ఓ ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చిన్నట్లు తెలుస్తుంది. చూసేందుకు చాలా సైలెంట్ గా కనిపించే ఈ హీరో తన వైవాహిక జీవితం పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యులో పాల్గొన్న ఆయన కి తన మ్యారిడ్ లైఫ్ గురించి ప్రశ్న ఎదురవగ్గా..”నాకు పెళ్లికి ముందు ఎలా ఉందో ఇప్పుడు అలా నే ఉంది . పెద్దగా ఛేంజస్ కనిపించడంలేదు. అలియా తో నా బంధం కూడా అలానే ఉంది. పెళ్లి అయితే చేసుకున్నాం కానీ..మా బిజీ లైఫ్ వల్ల ..కలిసి సమయం గడపలేకపోతున్నాం. పెళ్లి అయిన మరుసటి రోజు నుండే అలియా తన సినిమా షూటింగ్ లో బిజీ గా ఉంది. నేను నా మూవీ పనుల్లో బిజీ గా ఉన్నాను”.

“మేము పెళ్లికి ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాము..దీంతో మాకు పెళ్లి తరువాత పెద్ద ఇబ్బందులు రావడంలేదు. నిజం చెప్పాలంటే అస్సలు పెళ్లైందనే ఫీలింగ్ నే లేదు. అలియా లాంటి వైఫ్ దొరకడం హ్యాపీ. బాగా అర్ధం చేసుకుంటుంది . చైల్డిష్ బీహేవియర్..ఇంకా చిన్న పిల్లలాగనే అల్లరి చేస్తుంది. ఆమెలో ఆ అల్లరినే నాకు ఇష్టం” అంటూ చెప్పుకొచ్చారట. ఇక వర్క పరంగా మాట్లాడుతూ ప్రజెంట్ తన ఆశలనీ..బ్రహ్మస్త్ర పైనే పెట్టుకుని ఉన్నా అంటూ చెప్పుకొచ్చారు.

Latest news