Moviesక్రేజీ బజ్: మరో నయనతారగా మారనున్న కృతిశెట్టి..జాక్ పాట్ కొట్టిందిగా..?

క్రేజీ బజ్: మరో నయనతారగా మారనున్న కృతిశెట్టి..జాక్ పాట్ కొట్టిందిగా..?

ఇండస్ట్రీలో నయనతార అంటే ఎలాంటి గౌరవం ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కెరీర్ మొదట్లో ఒక్క హిట్ కోసం చాలా కష్ట పడినా..తరువాత తరువాత క్రమంగా తన రేంజ్ మార్చేసుకుంది. ఇపుడు సౌత్ లో అమ్మడు అందరికన్నా టాప్ లో ఉంది. సౌత్ హీరోయిన్స్ అందరికన్నా కూడా..నయనతారనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

రీసెంట్ గా కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేస్ ను పెళ్లి చేసుకుని..ఫామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ప్రజెంట్ నయన్ బాలీవుడ్ లో అట్లీ డైరెక్ట్ చేస్తున్న జవాన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా నయన్ లాగే మారబోతుంది హీరోయిన్ కృతిశెట్టి అంటూ వార్తలు వైరల్ గా మారాయి. 2005లో విడుదలైన హర్రర్ కామెడీ చిత్రం ‘చంద్రముఖి’ని తెలుగు, తమిళ ఆడియెన్స్ ఇప్పటికీ మరిచిపోలేరు. మనకు తెలిసిందే రజనీకాంత్ ప్రధాన పాత్రల్లో వచ్చినా..చంద్రముఖి సినిమాలో నయన్ ఓ స్పెషల్ రోల్ లో నటించించి జనాలను మెప్పించింది.

చంద్రముఖీ రోల్ లో దుర్గా అనే పాత్రలో నయన్ సైలెంట్ లుక్స్ తో అదరకొట్టేసింది. ఈ సినిమా ఆమె కెరీర్ కి ప్లస్ అయ్యింది. అయితే, దాదాపు గా 17 ఏండ్ల తర్వాత ఈ సీక్వెల్ రాబోతుందని చిత్ర మేకర్స్ అఫీషీయల్ గా ప్రకటించేశారు. దీంతో తెలుగు, తమిళ ప్రేక్షకులు ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. ఈ హర్రర్ అండ్ కామెడీ చిత్రంలో తన మార్క్ చూఒఇంచడానికి రెడీ అయ్యాడు రాఘవ లారెన్స్. కాగా , నయన చేసిన పాత్రను ‘చంద్రముఖి 2’లో కృతి శెట్టి చేయబోతుందంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సీక్వెల్ కు ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది. కాగా ఈ హర్రర్ చిత్రంలో స్టార్ హీరోయిన్ త్రిష కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణీ మ్యూజిక్ అందిస్తున్నారు. కెమెరామేన్‌గా ఆర్‌డీ రాజశేఖర్‌ బాధ్యలు చెపట్టారు. ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్ తోట తరణి కూడా వర్క్ చేయనున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news