Moviesఎంగేజ్మెంట్ త‌ర్వాత కూడా పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న హీరోయిన్లు... కార‌ణాలు ఇవే..!

ఎంగేజ్మెంట్ త‌ర్వాత కూడా పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న హీరోయిన్లు… కార‌ణాలు ఇవే..!

సినిమా హీరోలు, హీరోయిన్లు పెళ్లి చేసుకోవ‌డం.. ఆ త‌ర్వాత విడాకులు తీసుకోవ‌డం ఇప్పుడు కామ‌న్ అయిపోయింది. పెళ్లి, విడాకులు అనేవి ఇప్పుడు సినిమా వాళ్ల లైఫ్‌లో వెరీ రామ‌న్ అయిపోయాయి. అయితే కొంత‌మంది సినిమా హీరోలు, హీరోయిన్లు ఎంగేజ్మెంట్ త‌ర్వాత కూడా పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ లిస్టు కూడా చాలా పెద్ద‌దే. మ‌రి ఎంగేజ్మెంట్ చేసుకుని కూడా పెళ్లికి ముందే బ్రేక‌ప్ చెప్పుకున్న ఆ హీరో, హీరోయిన్లు ఎవ‌రో చూద్దాం.

1- త్రిష :
సౌత్ సినిమాను ప‌దేళ్ల‌కు పైగా త‌న అంద‌చందాల‌తో ఓ ఊపు ఊపేసింది త్రిష. అటు త‌మిళంతో పాటు తెలుగులో వ‌రుస‌గా సూప‌ర్ హిట్ సినిమాలు చేసింది. టాలీవుడ్ హీరో ద‌గ్గుబాటి రానాతో కూడా ఆమె క‌లిసి తిరిగింది. అంత‌కు ముందే మ‌రో న‌టుడు సిద్ధార్థ్‌తోనూ ప్రేమాయ‌ణం న‌డిపింది. చివ‌ర‌కు పారిశ్రామిక‌వేత్త వ‌రుణ్ మ‌ణియ‌న్‌తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే ఎంగేజ్మెంట్ త‌ర్వాత వ‌రుణ్ పెళ్ల‌య్యాక న‌టింకూడ‌ద‌న్న కండీష‌న్లు పెట్ట‌డంతో ఆమె పెళ్లి క్యాన్సిల్ చేసుకుని మ‌ళ్లీ సినిమాలు చేస్తోంది. త్రిష ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోలేదు.

2- విశాల్ :
తెలుగు వాడు అయినా కోలీవుడ్‌లో స్థిర‌ప‌డ్డ హీరో విశాల్ వ‌య‌స్సు ముదిరిపోతున్నా ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోలేదు. విశాల్ ఎంగేజ్మెంట్ అనీషా రెడ్డితో జ‌రిగింది. ఈ ఎంగేజ్మెంట్ కూడా హైద‌రాబాద్‌లోనే జ‌ర‌గ‌గా.. అనీషా రెడ్డి తెలుగు అమ్మాయే.. అయితే ఆరు నెల‌ల త‌ర్వాత ఈ జంట పెళ్లి చేసుకోకుండానే బ్రేక‌ప్ చెప్పేసుకుంది.

3- మెహ్రీన్ ఫిర్జాదా :
పంజాబీ అమ్మాయి అయిన మెహ్రీన్ టాలీవుడ్‌లో గ‌త ఐదారేళ్లుగా సినిమాలు చేస్తోంది. ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల‌తో బాగా పాపుల‌ర్ అయ్యింది. హ‌ర్యానా మాజీ ముఖ్య‌మంత్రి మ‌న‌వ‌డు, యువ రాజ‌కీయ వేత్త అయిన భ‌వ్య బిష్ణోయ్‌తో ఆమెకు ఎంగేజ్మెంట్ జ‌రిగింది. షేమ్ పెళ్ల‌య్యాక సినిమాల్లో న‌టించ‌కూడ‌దు.. సంప్ర‌దాయంగా ఇంటిప‌ట్టునే ఉండాల‌న్న కండీష‌న్‌తో ఆమె ఆ కండీష‌న్లు న‌చ్చ‌క బ్రేక‌ప్ చెప్పేసింది.

4- ర‌ష్మిక మంద‌న్న :
క‌న్న‌డంలో కిరాక్ పార్టీ సినిమాతో ఒక్క ఊపు ఊపేసింది ర‌ష్మిక‌. ఇదే టైంలో క‌న్న‌డ హీరో ర‌క్షిత్ శెట్టితో ప్రేమ‌లో మునిగి తేలింది. అప్పుడు ఆమెకు తెలుగు ఇండ‌స్ట్రీలో వ‌రుసగా స్టార్ హీరోల‌తో ఛాన్సులు రావ‌డం.. ఆ సినిమాలు సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఆమె ద‌శ తిరిగిపోయింది. ర‌క్షిత్ పెళ్లి కోసం ఒత్తిడి చేసినా ఆమె కెరీర్ కోసం ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది. అస‌లు ఇప్పుడు ర‌ష్మిక దూకుడుకు బ్రేకుల్లేవ్‌. ప్ర‌స్తుతం ర‌ష్మిక టాలీవుడ్ యంగ్ హీరోతో డేటింగ్‌లో ఉన్న‌ట్టు టాక్ ?

5- అక్కినేని అఖిల్ :
నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని అఖిల్ సినిమా చేసిన వెంట‌నే త‌న ప్రియురాలు… వ‌య‌స్సులో త‌న కంటే పెద్ద‌ది అయిన అపోలో గ్రూప్స్‌కు చెందిన శ్రియా భూపాల్‌రెడ్డితో ఎంగేజ్మెంట్ జ‌రిగింది. ఓ ఫంక్ష‌న్లో జ‌రిగిన చిన్న గొడ‌వ పెద్ద‌ది అయ్యి.. చివ‌ర‌కు వారు బ్రేక‌ప్ చెప్పేసుకునేవ‌ర‌కు వెళ్లింది. ఈ సంఘ‌ట‌న‌తో నాగార్జున చాలా హ‌ర్ట్ అయ్యాడు. అఖిల్‌తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యాక శ్రియా భూపాల్‌కు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి త‌న‌యుడితో పెళ్లి జ‌రిగింది.

6- ఉద‌య్ కిర‌ణ్ :
రెండు ద‌శాబ్దాల క్రితం వ‌రుస హిట్ల‌తో టాలీవుడ్ కుర్ర‌కారు మ‌ది దోచేసిన ఉద‌య్ కిర‌ణ్ – మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత‌కు ఎంగేజ్‌మెంట్ అయ్యింది. ఈ ఎంగేజ్మెంట్ త‌ర్వాత ఉద‌య్‌కిర‌ణ్ ద‌శ మారిపోయింది. ఒక్క‌సారిగా పెద్ద బ్యానర్లు, ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేసే ఛాన్స్ ద‌క్కించుకున్నాడు. ఎప్పుడు అయితే ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యిందో ఉద‌య్ కిర‌ణ్ కెరీర్ ఒక్క‌సారిగా తిర‌గ‌బ‌డింది. చివ‌ర‌కు ఉద‌య్ ఈ లోకాల‌నే విడిచి వెళ్లిపోయాడు.

7- క‌రిష్మా క‌పూర్ :
ఇక బాలీవుడ్‌లో ఒక‌ప్పుడు త‌న అంద చందాల‌తో ఊపేసిన సీనియ‌ర్ హీరోయిన్ క‌రిష్మా క‌పూర్‌కు బాలీవుడ్ బిగ్ బీ త‌న‌యుడు అభిషేక్‌ బ‌చ్చ‌న్‌కు కూడా ఎంగేజ్మెంట్ జ‌రిగింది. ఆ త‌ర్వాత స్ప‌ర్థ‌లు రావ‌డ‌తో క‌రిష్మా అభిషేక్ కు బ్రేక‌ప్ చెప్పేసి ఓ ఎన్నారైను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. ఇటు అభిషేక్ త‌న కంటే వ‌య‌స్సులో యేడాది పెద్ద అయిన మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్‌ను పెళ్లాడాడు.

Latest news