Moviesపెళ్లి చేసుకో అంటూ ఆ యాంక‌ర్ వెంట ప‌డుతోన్న అరియానా... !

పెళ్లి చేసుకో అంటూ ఆ యాంక‌ర్ వెంట ప‌డుతోన్న అరియానా… !

తెలుగు బిగ్‌బాస్ షోతో చాలా మంది బుల్లితెర యాంక‌ర్లు, యూట్య‌బ‌ర్లు బాగా పాపుల‌ర్ అవుతున్నారు. ఈ లిస్టులో అరియానా, దేత్త‌డి హారిక‌, ఓర్దార్ సుజాత ఇలా చాలా మంది బిగ్‌బాస్ షో త‌ర్వాత బ‌య‌ట బాగా క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే వీళ్ల‌కు సోష‌ల్ మీడియాలో కూడా తిరుగులేని పాపులారిటీ వ‌స్తోంది. బిగ్‌బాస్ షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చార అరియాన – ఆర్జీవీ ఇంట‌ర్వూతో బాగా బోల్డ్‌గా పాపుల‌ర్ అయిపోయింది.

ఈ ఒక్క ఇంట‌ర్వ్యూ అరియానా అంటే తెలియ‌ని వాళ్ల‌కు కూడా తెలిసిపోయేలా చేసింది. ఆ త‌ర్వాత కూడా అరియానా బోల్డ్‌గా పాపుల‌ర్ అయిపోయింది. హాట్ యాంక‌ర్లు, హాట్ హీరోయిన్ల‌కు పోటీగా అరియానా సోష‌ల్ మీడియాలో త‌న స్టిల్స్ వ‌దులుతోంది. తాజాగా యాంక‌ర్ శివ‌తో కల‌సి చేసిన ఓ రీల్ ఇప్పుడు సోష‌ల్ మీడియాను ఊపేస్తోంది.

శివ -అరియానా క‌లిసి మ్యారీ మీ రీల్ చేయ‌గా.. ఇప్పుడు ఈ రీల్‌కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వ‌స్తున్నాయి. లేడీ అబ్బాయితో ఉంగ‌రం తొగించుకుని పెళ్లి చేసుకోవాల‌ని కోరే ఈ వీడియో ఇప్పుడు అంద‌రి దృష్టిని ఎట్రాక్ట్ చేస్తోంది. త‌న‌ను పెళ్లి చేసుకోవాని అరియానా కోరితే శివ మాత్రం అస్స‌లు ప‌ట్టించుకోడు. అస‌లు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న‌ప్పుడే వీరి మ‌ధ్య పెద్ద క‌థే న‌డిచింది.

హౌస్‌లో ఉన్న‌ప్పుడు శివ అరియానాతో పులిహోర క‌లిపేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. అరియానా కాస్త సీరియ‌స్‌గా ఉండ‌డంతో శివ ప‌ప్పులు ఉడ‌క‌లేదు. ఇక ఇప్ప‌టికే శివ – అరియానా క‌లిసి చేసిన వంట వీడియోలు ఎంత‌లా వైర‌ల్ అయ్యాయో చూశాం. ఇక అరియానాకు ఇటు బుల్లితెర‌ప‌తో పాటు సోష‌ల్ మీడియాలో మంచి క్రేజ్ రావ‌డంతో వెండితెర ఆఫ‌ర్లు కూడా బాగానే వ‌స్తున్నాయ‌ట‌

అయితే కెరీర్ విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోన్న అరియానా మంచి స్టోరీతో పాటు త‌న‌కు పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే ఓకే చెప్పాల‌ని చూస్తోంది. ఏదేమైనా రియాలిటీ షోల విష‌యంలో అరియానా ఫ్యూచ‌ర్‌లో ఫుల్ బిజీ అయితే కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news