MoviesRRR: కష్ట పడ్డింది రాజమౌళి.. క్రెడిట్ అంతా బాలీవుడ్‌ కొట్టేస్తుందే..!!

RRR: కష్ట పడ్డింది రాజమౌళి.. క్రెడిట్ అంతా బాలీవుడ్‌ కొట్టేస్తుందే..!!

ఈ మధ్య కాలంలో ఆడియన్స్ బాగా నచ్చి మెచ్చి పొగడ్తలు కురిపించిన బిగ్గెస్ట్ భారీ బడ్జెట్ మూవీలు ఏవి అంటే..టక్కున్న చెప్పేది..”RRR” అండ్ “KGF2”. ఈ రెండు సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫిస్ ని షేక్ చేశాయి అనే చెప్పాలి. కని విని ఎరుగని రీతిలో కలెక్షన్స్ కొల్లగొట్టి..బాక్స్ ఆఫిస్ చరిత్రను తిరగరాశాయి ఈ సినిమాలు. ముఖ్యంగా RRR సినిమా కోసం రాజమౌళి పడిన కష్టం..పెట్టిన కష్టాలు..స్వయంగా ఇద్దరు హీరోలు తారక్, చరణ్ లే చెప్పుకొచ్చారు.

నాటు నాటు పాట కోసం మమ్మలని ముప్పుతిప్పలు పెట్టాడు అంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. వాళ్ళ పడ్డ కష్టానికి ప్రతి ఫలం దక్కింది. అభిమానులు , స్టార్స్ అందరు వాళ్ల పర్ ఫామెన్స్ ని..రాజమౌళీ డైరెక్షన్ ని మెచ్చుకున్నారు. హాలీవుడ్ స్టార్స్ కూడా RRR సినిమా ను చూసి రాజమౌళిని పొగిడేసారు. అయితే, ఇప్పుడు ఓ యుఎస్ సెల‌బ్రెటీ ఆర్ఆర్ఆర్‌ను బాలీవుడ్ మూవీగా పేర్కొంటూ ప్ర‌శంస‌లు కురిపించ‌డం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.

మొదటి నుండి ఇండియన్ సినిమాలు అంటే అంతా బాలీవుడ్ వైపే చూసేవారు. వాళ్ళ దృష్టిలో మంచి సినిమా, గ్రాఫిక్స్ వర్క్ అవుట్ లు అంతా బాలీవుడ్ వాళ్లే చేయగలరనే నమ్మకం. కానీ, ప్రజెంట్ సీన్ మారిపోయిందనే సంగతి వాళ్ళకి తెలియదు.

హీంది సినిమాలకంటే..తెలుగు సినిమాలే బాగా జనాలకి నచ్చుతున్నాయని..వాళ్ళు చూసి ఆహా ఓహో అంటూ పొగిడేస్తున్న సినిమాలు మన తెలుగు డైరెక్టర్లు తీశారని తెలియక..బాలీవుడ్ నే ఆ సినిమాలు తీశాయి అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ అమెరికా సెలబ్రిటీకి ..మన వాళ్ళు “RRR” సినిమా మాది..మా తెలుగు సినిమా అంటూ గర్వంగా చెప్పుకున్నారు. దీంతో తప్పు తెలుసుకున్న ఆ అమెరికా సెలబ్రిటీ..సారీ చెప్పుతూ మ్యాటర్ క్లోజ్ చేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news