Moviesప్రభాస్ వద్దు అన్న పని చేయబోతున్న చరణ్....వర్క్ అవుట్ అయ్యేనా..?

ప్రభాస్ వద్దు అన్న పని చేయబోతున్న చరణ్….వర్క్ అవుట్ అయ్యేనా..?

జనరల్ గా ఇండస్ట్రీలో ఒక్క హీరో చెయ్యాలసిన కధను మరో హీరో చేస్తుంటారు. అలాంటి పరిస్ధితులు వస్తుంటాయి. డైరెక్టర్..ఓ కధను విని..ఈ స్టోరీ పలనా హీరో అయితే సరిపోతాడు అని అనుకోని..అతని దగ్గరకు వెళ్లితే..ఆ స్టోరి సదరు హీరో కు నచ్చి..రెమ్యూనరేషన్ నచ్చి..హీరోయిన్ కుదిరితే ఓకే. కానీ, ఎక్క డ మధ్య లో తేదా కొట్టిన కధ మరో హీరో చేతికి వెళ్లిపోతుంది. ఇలా బడా స్టార్ హీరోలు చాలా సినిమాలే వదులుకున్నారు. చిరంజీవి,బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్,పవన్ కళ్యాణ్ , నితిన్, ప్రభాస్, మహేశ్..ఇలా అందరు హీరోలు ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేశారు.

ఇక ఇప్పుడు అదే సిట్యూవేషన్ మెగా పవర్ స్టార్ కి ఎదురైన్నట్లు తెలుస్తుంది . రీసెంట్ గా కమల్ హాసన్ విక్రమ్ సినిమా తో బ్లాక్ బస్టర్ మూవీని తన ఖాతాలో వేసుకున్న లోకేష్ కనగరాజు..ఆ తరువాత విజయ్ దళపతి తో ఓ సినిమా కి కమిట్ అయ్యాడు . ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో మూవీ అధికారిక ప్రకటన వచ్చింది. ఆ తరువాత కొరటాల శివతో ఓ సినిమా చేయాల్సి ఉంది.

ఈ మూవీలు కంప్లీట్ చేసిన తరువాత ప్రశాంత్ నీల్‌ లైన్లో ఉన్నాడు. ఈ సినిమా అయిపోగానే రామ్ చరణ్ తో మరో మూవీ కి కమిట్ అయ్యాడు లోకేష్ కనగరాజ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రజెంట్ శంకర్ డైరెక్షన్ లో RC15 సినిమా చేస్తున్న చరణ్..ఆ తరువాత వెంటనే లోకేష్ తో సినిమా సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడట.

అయితే, ఇక్కడ బిగ్గ్ షాకింగ్ ఏమిటంటే..ఇప్పుడు చరణ్ తో లొకేష్ తియ్యాలి అనుకుంటున్న సినిమా కధను ఆల్ రెడీ ప్రభాస్ కు చెప్పారట డైరెక్టర్. కానీ, ప్రభాస్ కి ఈ సినిమాలో కొన్ని సీన్స్ నచ్చలేదట. స్క్రిప్ట్ మార్చమని అడిగినా లోకేష్ సైలెంట్ అయ్యిపోయాడట. దీంతో ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేసిన్నట్లు మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు అదే కధను చరణ్ విని ఓకే చేసిన్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి దీని పై అఫిషీయల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news