Moviesఅర్జెంట్‌గా పాపులర్‌ కావాలంటే ఏం చేయాలి..?

అర్జెంట్‌గా పాపులర్‌ కావాలంటే ఏం చేయాలి..?

సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు సామాన్యులు కూడా సెలబ్రిటీలు అయిపోతున్నారు. యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి..తమ టాలెంట్ ను నలుగురికి చూయిస్తున్నారు. ఇలా ఈ విధంగా పాపులర్ అవ్వాలి అంటే..ఎన్నో నెలలు కష్టపడాలి..కొన్ని సార్లు సంవత్సరాలు టైం పడుతుంది. అయితే, అర్జెంట్‌గా ఓవర్ నైట్ లో స్టార్ సెలబ్రిటీ రేంజ్ లో పాపులర్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే.. వెంటనే ప్రముఖ యాంకర్ దేవి నాగవళ్లి తో ఇంటర్వ్యు చేయాలి అంటూ మీమ్‌స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంతో మరోసారి విశ్వక్ సేన్ దేవి నాగవళ్లి ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.

ప్రముఖ ఛానెల్ లో న్యూస్ రిపోర్టర్ గా పని చేస్తున్న దేవి నాగవళ్లి పేరు గత కొన్ని రోజులుగా న్యూస్ హెడ్ లైన్స్ లో హాట్ టాపిక్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరో విశ్వక్ సేన్ తన సినిమా ప్రమోషన్స్ కోసం ప్రాంక్ వీడియో చేయగా.. అది కాస్త నెగిటివ్ గా వెళ్ళి.. ప్రముఖ ఛానెల్ లో డిబేట్ పెట్టారు. ఈ టైం లోనే అక్కడికి వెళ్లిన హీరో.. తో యాంకర్ కు ఓ ఇష్యూ ఏర్పడింది. దీంతో మాట మాట పెరిగి ఆమె గెట్ అవుట్ అనడం..దానికి హీరో ఓ బూతు పదం వాడటం..దీంతో ఈ మ్యాటర్ టూ హీట్ పెంచింది. ఆ తరువాత ఎట్టకేలకు సినిమా తో హిట్ కొట్టిన హీరో..సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే, ఈ క్రమంలోనే ఈ ఇష్యూకి సంబంధించిన మీమ్‌స్ నెట్టింట వైరల్ గా మారాయి. కొందరు ఛత్రపతి మూవీ లోని సీన్స్ ను మ్యాచ్ చేస్తూ..వీళ్లిద్దరిని పోలుస్తుంటే.. మరి కొందరు ఫనీగా..ఓవర్ నైట్ లో స్టార్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటుంది. క్రింద దేవి విశ్వ ఫోటోలను చూయిస్తూ..ఈమె తో ఇంటర్వ్యులో పాల్గొంటే చాలు నువ్వు స్టార్ అయిపోయిన్నట్లే అంటూ చెప్పుతుంటారు. ఇదే కాదు ఈ రకంగా చాలా మీమ్‌స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేవలం విశ్వ తోనే కాదు గతంలో ఇలాగే అర్జున్ రెడ్డి సినిమా టైంలో విజయ్ దెవరకొండతో కూడా ఇస్తూ అయ్యింది. దీంతో ఇది కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టినట్టవుతుంది. దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుండటం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news