Movies' ఆచార్య‌ ' తో కొర‌టాల సంపాదించిందంతా హుష్‌కాకేనా... వామ్మో అన్ని...

‘ ఆచార్య‌ ‘ తో కొర‌టాల సంపాదించిందంతా హుష్‌కాకేనా… వామ్మో అన్ని కోట్లు బొక్కా…!

ర‌చ‌యిత‌గా కొర‌టాల శివ ఎంత ఫేమ‌స్ అయ్యాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బృందావ‌నం లాంటి సూప‌ర్ హిట్ సినిమాకు స్టోరీ రైట‌ర్‌గా ఫేమ‌స్ అయిన కొర‌టాల ప్ర‌భాస్ హీరోగా మిర్చి సినిమాను తెర‌కెక్కించి తొలి సినిమాతోనే తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాడు. త‌ర్వాత రెండో సినిమాతోనే ఏకంగా సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబును డైరెక్ట్ చేసి శ్రీమంతుడు కొట్టాడు. శ్రీమంతుడు సినిమాలో గ్రామాల ద‌త్త‌త అనే కాన్సెఫ్ట్‌కు నేష‌న‌ల్ వైడ్‌గా ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ఆ త‌ర్వాత యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌తో జ‌న‌తా గ్యారేజ్ మ‌ళ్లీ సూప‌ర్ హిట్‌. ఆ త‌ర్వాత మ‌రోసారి మ‌హేష్‌బాబుతో భ‌ర‌త్ అనే నేను ఆ సినిమా కూడా హిట్. ఏకంగా మ‌హేష్‌ను ముఖ్య‌మంత్రిగా చూపించిన ఈ సినిమా సూప‌ర్ హిట్‌. 2018లో భ‌ర‌త్ అనే నేను సినిమా వ‌చ్చింది. ఈ సినిమా త‌ర్వాత ఆచార్య సినిమా చేసేందుకు మ‌హేష్‌కు ఏకంగా నాలుగేళ్లు టైం ప‌ట్టింది.

ఇటు చిరంజీవితో సినిమా ఓ ప‌ట్టాన తెమ‌ల‌క పోవ‌డంతో పాటు అటు హీరోయిన్ ఎంపిక‌.. చివ‌ర‌కు ఈ ప్రాజెక్టులోకి చెర్రీ రావ‌డం.. క‌థ‌లో మార్పులు.. క‌రోనా క‌ష్టాలు.. రిలీజ్ డేట్లు వాయిదాలు ప‌డి ఎట్ట‌కేల‌కు గ‌త నెల 29న ఆచార్య థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. క‌ట్ చేస్తే సినిమా వారం రోజుల‌కే ఫైన‌ల్ ర‌న్ ముగిసేంత డిజాస్ట‌ర్ టాక్ తెచ్చింది.

నాలుగేళ్లుగా కొర‌టాల ఈ సినిమా కోసం క‌ష్ట‌ప‌డ్డాడు. క‌ట్ చేస్తే ఈ సినిమా కోసం కొర‌టాల త‌న కెరీర్‌లో నాలుగేళ్ల విలువైన స‌మ‌యం వృథా చేశాడు. ఈ సినిమాకు కొర‌టాల బ‌డ్జెట్ నేప‌థ్యంలో రెమ్యున‌రేష‌న్ తీసుకోలేదు. నిర్మాత నిరంజ‌న్ రెడ్డికి కొంత అమౌంట్ ఇచ్చి సినిమా బ‌రువు, బాధ్య‌త‌లు అన్నీతానే తీసుకున్నాడ‌ట‌. అయితే ఇప్పుడు డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు భారీ రేట్ల‌కు అమ్మ‌డంతో వాళ్ల‌కు అమౌంట్ తిరిగి ఇవ్వాల్సిన బాధ్య‌త కూడా కొర‌టాల మీదే ప‌డింది.

ఓవ‌రాల్‌గా చూస్తే కొర‌టాల మామూలుగా సినిమాకు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటే రు. 25 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఉంటుంది. ఇప్పుడు ఆ అమౌంట్ పోవ‌డంతో పాటు డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు మ‌రో రు. 30 – 35 కోట్లు వెన‌క్కు ఇవ్వాల్సి ఉంద‌ని అంటున్నారు. ఈ లెక్క‌న చూస్తే కొర‌టాల‌కు రు. 60 కోట్ల‌వ‌ర‌కు న‌ష్టం అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. అంటే కొర‌టాల ఆచార్య‌తో కొత్త‌గా సంపాదించుకున్న‌ది లేదు… ఉన్న‌దే చాలా వ‌ర‌కు పోగొట్టుకున్న‌ట్టు అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news