Moviesఅల్లు అర్జున్ అభిమానులకు అమేజింగ్ న్యూస్..!!

అల్లు అర్జున్ అభిమానులకు అమేజింగ్ న్యూస్..!!

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఫుల్ స్వింగ్ మీద ఉన్నాడు . ఆయన లాస్ట్ చిత్రం “పుష్ప” బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజయం అందుకుంది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఆయన పుష్ప రాజ్ పాత్రలో నటించలేదు..చించేశాడు . ఈ సినిమా చూశాక బడా బడా స్టార్స్ సైతం అయన్ను ఓ రేంజ్ లో పొగిడేశారు. అంతేకాదు..అవకాశం వస్తే ఖచ్చితంగా ఆయనతో నటించాలని ఉంది అంటూ…బాలీవుడ్ ముద్దుగుమ్మలు దిపీకా పదుకునే, అలియా భట్ లు చెప్పుకొచ్చారు. వీళ్లే కాదు బడా స్టార్స్ కూడా..బన్నీ తో సినిమాలు తీసేందుకు సిద్ధంగా ఉన్నారు.

త్వరలోనే బన్ని బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని..ఇప్పటికే ఓ ప్రముఖ స్టార్ డైరెక్టర్ తో స్క్రిప్ట్ ఓకే అయ్యిందని..పుష్ప 2 కంప్లీట్ అయ్యాక ఈ సినిమా పనులు ప్రారంభించే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే తెలుగులో అల్లు అర్జున్ తీసిన సినిమాలు అక్కడ డబ్ అయ్యి..బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాయి. ఇక బన్నీ డైరెక్ట్ గా హిందీ మూవీ చేస్తే.. బాలీవుడ్ ని ఏలేయడం పక్క అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా, అల్లు అర్జున్ సుకుమార్ తో పుష్ప 2 పనులను ఇక స్టార్ట్ చేస్తున్నరు అంటూ ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మనకు తెలిసిందే పుష్ప సినిమా రెండూ భాగాలు గా తెరకెక్కబోతుందని సుకుమార్ ముందే చెప్పారు.

ఇక, పుష్ప 2 షూటింగ్ ఎప్పుడా అని వెయిట్ చేస్తున్న అభిమానులకు బన్నీ త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించబోతున్నాడంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. జూన్ మొదటి వారంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభిస్తారట. ఇక అప్పటి నుండి రెగ్యూలర్ షూటింగ్ పనులు మొదలవుతాయని టాక్ వినిపిస్తుంది. నిజానికి పుష్ప 2 ని కూడా సుకుమార్ డిసెంబరు 17న రిలీజ చేయాలని భీష్మించుకుని కూర్చున్నారు. మధ్యలో షూటింగ్ లేట్ అవుతుంది విడుదలకు టైం తీసుకుంటారు అని చెప్పినా..అవి ఫేక్ న్యూస్ గా బయటపడ్డాయి. పుష్ప 2 సుకుమార్ అనుకున్నట్లు 17 డిసెంబరు 2022 లో రిలీజ్ చేయడానికి గట్టిగా ప్లాన్ చేస్తున్నారట టీం. మరి చూడాలి..పుష్ప 2 ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news