Moviesవావ్: పూజా హెగ్డే కు పూరి జగన్నాథ్ కళ్లు చెదిరే బంపర్...

వావ్: పూజా హెగ్డే కు పూరి జగన్నాథ్ కళ్లు చెదిరే బంపర్ ఆఫర్.. ?

టాలీవుడ్ డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన స్టైల్ లో సినిమా లు తీస్తూ.. చాలా మంది హీరోలకి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చాడు. ఇప్పుడు స్టార్ హీరోలు గా సినీ ఇండస్ట్రీలో రాజ్యమేలుతున్న దాదాపు అందరు హీరోలకి కెరీర్ మలుపు తిప్పిన సినిమాలను డైరెక్ట్ చేసింది పూరీ నే. కాని గత కొంత కాలంగా ఆయన టైం బాగోలేదు అనే చెప్పాలి. ఎంత కష్టపడి సినిమాలు తీసినా..అవి బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఎలాగోలా ఇస్మార్ట్ శంకర్ తో చాలా కాలం తరువాత హిట్ కొట్టిన పూరీ.. ప్రజెంట్ విజయ్ దేవరకొండతో..”లైగర్” అనే మూవీ చేస్తున్నాడు.

అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా త్వరలో నే రిలీజ్ కు సిద్ధంగా ఉంది. కాగా, మళ్ళీ ఇదే హీరో తో పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ “జనగణమన” అనే సినిమాకు ఫిక్స్ అయ్యాడు. వేగంగా సినిమాలు ఫినిష్ చేయడంలో పూరి జగన్నాథ్ ముందువరుసలో ఉంటారు. అనుకోవాలి గానీ రెండు మూడు నెలల్లో కూడా పూర్తి చేయగల సత్తా పూరీది. అదే ఫార్ములాతో ఇప్పుడు ‘జనగణమన’ మూవీ విషయంలో కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చకచకా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆయన సన్నాహాలు చేస్తున్నారట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ బుట్టబోమ్మ పూజా హెగ్డే నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, ఈ సినిమా లో పూజా పాత్ర చాలా ఢిఫరెంట్ గా ఉంటాదని..కేవలం గ్లామరస్ పరంగానే కాకుండా..సినిమా లో చాలా కీ ఎమిమెంట్స్ తో ఈమెకు ముడిపెట్టిన్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే , ఈ సినిమా కోసం పూజా కు కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ ఇవ్వడానికి రెడి అయ్యాడట పూరీ. దేశవ్యాప్తంగా ఏ హీరోయిన్ అందుకోనంత రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపుదిద్దుకోనుంది. ఇది ప్రధానంగా సైనిక నేపథ్యంలో వచ్చే సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ని సైతం లాక్ చేసాడు పూరీ. 3 ఆగస్ట్ 2023 లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాడట పూరి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news