Moviesవెంకటేష్ ఆ హీరోయిన్ తో మాట్లాడడు అనే విషయం మీకు తెలుసా..ఎందుకంటే?

వెంకటేష్ ఆ హీరోయిన్ తో మాట్లాడడు అనే విషయం మీకు తెలుసా..ఎందుకంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి వెంకటేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫ్యామిలీ హీరో గా పేరు తెచ్చుకున్న ఆయన..కొంతమంది హీరోలలాగా తీసుకున్న కథనే మరీమరీ తీసుకుంటూ ప్రేక్షకులకు బోర్ కొట్టించేలా ఉండకుండా, విభిన్న కథలతో ఎప్పటికప్పుడు తనలో ఉన్న మేకోవర్ ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ, సినీ ఇండస్ట్రీ లో దూసుకుపోతున్నాడు విక్టరీ వెంకటేష్. అయితే ఇప్పటికే వెంకటేష్ తన 35 సంవత్సరాల సినీ కెరీర్ ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు. అయితే, ఇన్నాళ్ల తన కెరీర్ లో ఆల్ మోస్ట్ ఆల్ అందరి హీరోయిన్ లతో ఆది పాడిన ఈ దగ్గుబాటి వారసుడు.. ఒక్క హీరోయిన్ తో మాత్రం దూరంగా ఉన్నాడు.

ఆమె ఓ స్టార్ సీనియర్ హీరోయిన్. ప్రజెంట్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఒకానోక టైం లో ఆయన కంటే ఈమె ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని..వెంకటేష్ కు షాక్ ఇచ్చింది. నిజానీకి వీళ్ల కాంబో లో ఓ సినిమా సెట్ అయ్యిందట. స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ లో హీరో వెంకటేష్‌తో కలిసి ఓ సినిమా చేద్దాం అనుకుని ఆమెతో కొన్ని చర్చలు నడిచాయని టాక్ వినిపించింది అప్పట్లో. అయితే కొన్ని కారణాల వల్ల ఆ కాంబినేషన్ వర్కౌట్ కాలేదు.అదే కథాంశంతో కొన్నేళ్ల తరువాత మరో సూపర్ హీరోయిన్ ఆమె కూడా ప్రజెంట్ పాలిటిక్స్ లో బిజీ గా ఉంది.

ఆ హీరోయిన్ తో సినిమా తెరకెక్కించారు వేరే దర్శక నిర్మాతలు. ఆ స్టోరీ సేమ్ టూ సేమ్ తనకు వినిపించిన స్టొరీలానే ఉందని.. తనను కాదని మరో హీరోయిన్ ని పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని..రప్ఫాడించేసిందట వెంకటేష్ ని. దీంతో కోపడిపోయిన వెంకటేష్..ఆమెకు అదంతా నిర్మాతల నిర్ణయమని, తన ప్రమేయం లేదన్నారట . దీంతో వాళ్ల మధ్య వార్ ముదిరి మౌనంగా ఉండిపోయారట. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమెకు వెంకటేష్ మధ్య మాటలు లేవని టాక్. ఈ విషయం ఇండస్ట్రీలో కూడా చాలా మందికి తెలుసు. కానీ కలిపే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆమె ఎంత మొండిదో అందరికి తెలిసిందే. మరి వీళ్లు ఎప్పటికి కలుసుకుంటారో.. మాట్లాడుకుంటారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news