Moviesఆ హీరో కోసం రూల్స్ బ్రేక్ చేస్తున్న పూజా..రష్మిక ఆనందం చూశారా..?

ఆ హీరో కోసం రూల్స్ బ్రేక్ చేస్తున్న పూజా..రష్మిక ఆనందం చూశారా..?

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే..కాళ్ల అందాలతోనే పడకొట్టే బ్యూటీ. ఏ ముహుర్తాన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో తెలియదు కానీ..పాపం, కెరీర్ మొదట్లో ఒక్క హిట్ కొట్టడానికి నానాతిప్పలు పడింది. వరుస్ ఫ్లాప్ లు పడుతున్నా బాధ పడకుండా..వచ్చిన సినిమాల్లో నచ్చిన మూవీస్ కి కమిట్ అవుతూ..వీళైనంత ఎక్స్ పోజింగ్ చేస్తూ..వచ్చింది. ఫైనల్ గా ఐరెన్ లెగ్ అంటూ ఓ ముద్ర వేసుకున్న ఈ హీరోయిన్ కి అరవింద వీర రాఘవ సమేత అంటూ యంగ్ టైగర్ NTR మర్చిపోలేని విధంగా కెరీర్ లో ఫస్ట్ హిట్ ఇచ్చారు.

ఇక అప్పటి నుండి అమ్మడు జాతకం మారిపోయింది. బడా బడా ఆఫర్స్ అందుకుని..ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో చక్రం తిప్పుతుంది. అయితే, ఈ మధ్య ఆమె నటించిన మూడు సినిమా వరుసగా ఫ్లాప్ అవ్వడంతో..ఆమె తను పెట్టుకున్న రూల్స్ బ్రేక్ చేస్తూ..ఐటెం సాంగ్స్ లో చిందులు వేయ్యడానికి ఓకె చెప్పుతుంది. అప్పుడెప్పుడో రంగస్ధలం సినిమాలో చరణ్ తో కలిసి జిగేళ్ళు రాణి అంటూ చిందులు వేసిన ఈ బ్యూటీ..తాజాగా వెంకీ, వరుణ్ తో కలిసి లైఫ్ అంటే ఇట్ట ఉండాలే అంటూ హాట్ లుక్స్ తో చంపేసింది. F3 సినిమా మొత్తనికి ఈ పాటనే హిట్టైంది అంటే..అమ్మడు అందాలు ఏ రేంజ్ లో జనాలకు నచ్చేశాయో అర్ధం చేసుకోండి.

ఇక ఇప్పుడు మరోసారి ఐటేం సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట పూజా. సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్న యానిమల్ సినిమాలో అమ్మడు మరోసారి అందాల ట్రీట్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ యానిమల్ మూవీలో రణ్ బీర్ కపూర్ , రష్మిక మందన్న హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇక ఇదే చిత్రంలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేస్తే ఖచ్చితంగా సినిమాకి ప్లస్ అవుతుంది. తద్వారా, సినిమా హిట్ అయితే రష్మిక ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడిన్నట్లే. గతంలో పుష్ప సినిమాలో సమంత ఐటెం సాంగ్ మూవీ హిట్ కు ప్రధాన కారణంగా నిలిచింది. ఇక ఇప్పుడు అదే ఫార్ములా ని నమ్మి తెగ ఆనందపడుతుందట రష్మిక. మరి చూడాలి రష్మిక ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news