Moviesభార్య దీపిక‌ను ఈ చిన్న చిట్కాతో ఇంప్రెస్ చేస్తానంటోన్న ర‌ణ్వీర్‌సింగ్‌

భార్య దీపిక‌ను ఈ చిన్న చిట్కాతో ఇంప్రెస్ చేస్తానంటోన్న ర‌ణ్వీర్‌సింగ్‌

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లు.. హీరోలు ప్రేమ‌లో ప‌డుతున్నారు. వీళ్లు పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. ర‌ణ్వీర్ సింగ్ – దీపికా ప‌దుకొనే, క‌త్రినా కైఫ్‌, విక్కీ కౌశ‌ల్ ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నారు. ఈ రెండు జంట‌ల ప్రేమాయ‌ణం బాలీవుడ్‌ను కొన్నేళ్ల పాటు ఊపేసింది. ఎక్క‌డ చూసినా ఈ రెండు జంట‌లే హైలెట్‌గా వార్త‌ల్లో నిలిచేవి.

ఇక ర‌ణ్వీర్ – దీపిక 2018లో పెళ్లి చేసుకున్నారు. ర‌ణ్వీర్‌తో ప్రేమ‌కు ముందే దీపిక కొన్ని ప్రేమాయ‌ణాలు న‌డిపింది. చివ‌ర‌కు ఎట్ట‌కేల‌కు ర‌ణ్వీర్‌తో మూడు ముళ్లు వేయించుకుంది. ఇక లాక్‌డౌన్ టైంలో వీరు త‌మ దాంప‌త్య జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసినట్టు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ర‌ణ్వీర్ త‌న భార్య దీపిక‌పై ఎక్క‌డా లేని ప్రేమ‌ను కురిపించేస్తున్నాడు. ఇక లాక్‌డౌన్ టైంలో త‌న కోసం భార్య దీపిక చాలా క‌ష్ట‌ప‌డింద‌ని.. త‌న కోసం నేర్చుకుని మ‌రీ వంట‌లు చేసింద‌ని చెప్పాడు.

నా భార్య చాలా అద్భుత‌మైన చెఫ్ అని.. లాక్‌డౌన్‌లో తాము చ‌క్క‌గా ఎంజాయ్ చేశాం అని.. చైనీస్ ప్రాన్స్ చేయ‌డంలో దీపిక ఎక్స్‌ఫ‌ర్ట్ అని ర‌ణ్వీర్ చెప్పాడు. త‌న భార్య వంట‌కాల‌ను అంత‌లా పొగుడుతోన్న ర‌ణ్వీర్ తాను మాత్రం వంట చేయ‌లేద‌ని.. అయితే వంట చేయ‌కుండానే త‌న భార్య‌ను ఎలా ఇంప్రెస్ చేయాలో త‌న‌కు బాగా తెలుసని చెప్పాడు.

ఇటీవ‌ల తాను కొత్తిళ్లు తీసుకున్నాం.. నాకు వంట రాక‌పోయినా కొత్త ఇంటిలోకి వెళ్లిన త‌ర్వాత ఖ‌చ్చితంగా దీపిక కోసం బ్రేక్‌ఫాస్ట్ చేస్తాన‌ని.. ఆమెను నా ఒడిలో కూర్చోపెట్టుకుని. నా చేతుల‌తోనే ఆమెకు టిఫిన్ తినిపిస్తాన‌ని చెపుతున్నాడు. ఇలా త‌న భార్య‌పై ర‌ణ్వీర్ త‌న‌కు ఉన్న అనంత ప్రేమ‌ను చాటుకున్నాడు. దీపిక కోసం ఎగ్ కర్రీ కూడా రెడీ చేస్తాన‌ని గ‌తంలోనే తాను మాట ఇచ్చాన‌ని చెపుతున్నాడు. ఏదేమైనా ర‌ణ్వీర్ దీపిక‌ను ఇంప్రెస్ చేసేందుకు మామూలు స్కెచ్‌లు వేయ‌డం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news