Moviesమ‌హేష్‌తో చిరాకులు, గొడ‌వ‌ల‌పై ఓపెన్ అయిన ప‌ర‌శురాం... షూటింగ్‌లో ఇంత జ‌రిగిందా...!

మ‌హేష్‌తో చిరాకులు, గొడ‌వ‌ల‌పై ఓపెన్ అయిన ప‌ర‌శురాం… షూటింగ్‌లో ఇంత జ‌రిగిందా…!

సర్కారువారి పాట సినిమా ట్రైల‌ర్ బ‌య‌ట‌కు రావ‌డంతో సినిమాకు పాజిటివ్ బ‌జ్ ప‌దింత‌లు పెరిగిపోయింది. సినిమా అయితే సూప‌ర్ హిట్ అంటున్నారు. ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ టాక్‌తో పాటు ట్రేడ్ వ‌ర్గాల్లోనూ ఇదే వినిపిస్తోంది. మ‌రోవైపు ప్ర‌మోష‌న్లు కూడా హోరెత్తించేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త బాగా వైర‌ల్ అయ్యింది. షూటింగ్ టైంలో హీరో మ‌హేష్‌కు, ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాంకు మ‌ధ్య చిన్న‌పాటి గొడ‌వ జ‌రిగింద‌న్న‌దే ఆ వైర‌ల్ న్యూస్‌.

అయితే సినిమా రిలీజ్‌కు ముందు ప్ర‌మోష‌న్ల‌లో ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం ఈ గొడ‌వ‌ల వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చారు. ఓ ద‌శ‌లో ప‌ర‌శురాంపై మ‌హేష్ చాలా అస‌హ‌నం వ్య‌క్తం చేశాడంటూ కూడా క‌థ‌నాలు రావ‌డంతో దానిపై కూడా ప‌ర‌శురాం స్పందించాడు. అయితే ప‌ర‌శురాం ఇచ్చిన ఆన్స‌ర్ చాలా తెలివిగా ఉంద‌నే చెప్పాలి. ఓ పెద్ద సినిమా చేస్తున్న‌ప్పుడు ఖ‌చ్చితంగా కొన్ని చిరాకులు అయితే ఉంటాయ‌న్నాడు.

మ‌హేష్ సినిమా త‌న‌కు కేక్ వాక్‌లా అయితే లేద‌ని.. మూడు ద‌శ‌ల్లో క‌రోనా రావ‌డంతో ఇదే స్క్రిఫ్ట్‌ను మ‌హేష్ మూడు సంవ‌త్స‌రాల పాటు త‌న మైండ్‌లో పెట్టుకుని ట్రావెల్ చేయాల్సి వ‌చ్చింద‌ని చెప్పాడు. మూడేళ్ల పాటు ఒకే క‌థ‌పై ట్రావెల్ చేయ‌డం అంటే కాస్త క‌ష్ట‌మైన ప‌నే అని.. ఈ జ‌ర్నీలో ఒక‌ట్రెండు ఘ‌ట‌న‌లు జ‌రిగి ఉండొచ్చే త‌ప్పా.. మ‌హేష్ ఓవ‌రాల్‌గా త‌న‌ను ఓ బ్ర‌ద‌ర్‌లా చూసుకున్నార‌ని ప‌ర‌శురాం చెప్పాడు.

ఓవ‌రాల్‌గా చూస్తే మ‌హేష్ త‌న‌ను ఓ బ్ర‌ద‌ర్‌లా చూసుకున్నాడ‌ని ప‌ర‌శురాం చెప్పారు. అయితే త‌మ మ‌ధ్య చికాకుల‌కు ప‌ర‌శురాం కొన్ని కార‌ణాలు కూడా చెప్పాడు. అన్న‌పూర్ణ స్టూడియోలో చేయాల్సిన సీన్ల‌ను రామోజీ ఫిల్మ్‌సిటీలో చేసిన టైంలో మ‌హేష్ చికాకు ప‌డి ఉండ‌వ‌చ్చ‌ని.. అంత మాత్రాన మా మ‌ధ్య ఏందో ఉంద‌ని అనుకోవ‌డం క‌రెక్ట్ కాద‌ని చెప్పాడు.

మ‌హేష్ ఎవ‌రికి అయినా ఓ ఛాన్స్ ఇస్తార‌ని.. దానిని స‌ద్వినియోగం చేసుకుంటే హ్యాపీ అని ప‌ర‌శురాం తెలిపాడు. ఇక స‌ర్కారు వారి పాట సినిమాకు సంబంధించి చాలా టైటిల్స్ తెర‌మీద‌కు వ‌చ్చాయ‌ని.. అందులో నిజం లేద‌ని కూడా చెప్పేశాడు. త‌న మ‌దిలో త‌ట్టిన టైటిల్‌ను వెంట‌నే మ‌హేష్‌కు చెపితే ఓకే చెప్పేశార‌ని.. త‌ర్వాత పోస్టర్ డిజైన్ చేయ‌గా దానికి కూడా వెంట‌నే ఓకే చెప్పిన‌ట్టు ప‌ర‌శురాం తెలిపాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news