Moviesనయన్-విగ్నేశ్ పెళ్లి పత్రికలు రెడీ..ఫస్ట్ స్పెషల్ కార్డ్ ఎవ్వరికంటే..?

నయన్-విగ్నేశ్ పెళ్లి పత్రికలు రెడీ..ఫస్ట్ స్పెషల్ కార్డ్ ఎవ్వరికంటే..?

గత కొన్ని సంవత్సరాలుగా లేడీ సూపర్‌ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లి కాకుండానే వీళ్లు పబ్లిక్ గానే చేతిలో చెయ్యి వేసుకుని తిరిగేస్తున్నారు. నయనతార – విఘ్నేష్ శివన్ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ తమ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించారు. ఇక కొన్నాళ్లుగా అదిగో.. ఇదిగో… అంటూ ఈ జంట పెళ్లిపై చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎట్టకేలకు ఈ జంట ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూన్ 9న చాలా సింపుల్ గా శ్రీవారి సన్నిధిలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యిన్నట్లు తెలుస్తుంది. పెళ్లి కి టైమ్ దగ్గర పడుతుండటంతో.. నయన్-విగ్నేశ్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారట. పెళ్లి సింపుల్ గా పద్ధతిగా కానిచ్చేసినా..ఆ తరువాత రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా కోలీవుడ్ లో ఇప్పటి వరకు ఎవ్వరు చేయని స్టైల్ లో చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది.

ఇందు కోసమే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి ఆహ్వానం అందినా నయనతార..వెళ్ళకుండా తన లైఫ్ లోని స్పెషల్ మూమెంట్ ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యిందట. పెళ్లి ఏర్పాట్లు దగ్గర ఉండి వారు స్వయంగా చేసుకుంటున్నారు. దాంతో కోలీవుడ్ లో పెళ్లి సందడి స్టార్ట్ అయ్యింది. కాగా, ఇప్పటికే వీళ్ల పెళ్లి పత్రికలు ప్రింట్ అయ్యాయి అని..ఫస్ట్ కార్డ్ సాంప్రదాయబద్ధంగా తమ కులదైవం పాదాల చెంత వారు పెట్టినట్టు సమాచారం. జూన్ 9వ తేదీన వీరి పెళ్ళి జరగబోతోంది. ఇక పెళ్లి కారణంగా నయనతార ఏ కొత్త సినిమాలోకు కమిట్ అవ్వలేదు..పెళ్లి తరువాత కొన్ని రోజులు హనీమూన్ వగైరా ప్రోగ్రామ్ లు అయిపోయాక ..కెరీర్ పై మళ్లి దృష్టి పెట్టేటట్లు నయన్ ప్లాన్ చేసుకుందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news