Moviesఅబ్బ..ఉపాసన కాస్ట్లీ కారు ఎంత లగ్జరీగా ఉందో..మైండ్ బ్లోయింగ్..!!

అబ్బ..ఉపాసన కాస్ట్లీ కారు ఎంత లగ్జరీగా ఉందో..మైండ్ బ్లోయింగ్..!!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా ఎక్కువ అయిపోయింది. 10 కూడా పాస్ అవ్వని పిల్లాడి దగ్గర నుండి..ముసలవ్వ లు వరకు అందరికి సోషల్ మీడియా అకౌంట్ లు ఉన్నాయి..ఫాలోవర్స్ ఉన్నారు. ముఖ్యంగా యూట్యూబ్ అందుబాటులోకి వచ్చాక..ఇలా అందరు సోషల్ మీడియాని బాగా వాడేస్తున్నారు. కొందరు స్టేటస్ కోసం, కొందరు డబ్బు కోసం, కొందరు మనకు తెలిసిన మంచి విషయాలను నలుగురికి తెలిసేలా చేయడం కోసం.

ఈ క్యాటగిరీలోకే వస్తుంది..స్టార్ డాటర్ కమ్ మెగా కోడలు ఉపాసన. మెగా కోడలు అనడం కన్నా కూడా..ఇండిపెండెంట్ ఉమెన్..అంటే చాలా బాగుంటుంది. ఉపాసన చాలా చురుకైన అమ్మాయి..నచ్చిందే చేస్తుంది..అనుకున్నది సాధిస్తుంది. ఆ విషయం ఇప్పటికే మనం చాలా విషయాలల్లో చూశాం. భర్తకు తగ్గ భార్య గా అన్ని విషయాలల్లో చరణ్ కి బాగా హెల్ప్ చేస్తుంది. మెగా ఇంటి పరువు నిలబెడుతుంది.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ..ప్రజలకి హెల్త్ టిప్స్ ఇస్తూ..తనకు సంబంధించిన..నలుగురికి ఉపయోగ కరమైన విషయాలను తెలియజేస్తుంటుంది ఉపాసన. ఈ క్రమంలోనే తను కొన్న కొత్త కారు గురించి అభిమానులతో పంచుకుంది. తాను ఆ కారు ఎందుకు కొన్నుకున్నానో చెప్పుతూ..స్పెషాలిటీస్ చెప్పుకొచ్చింది.

సూపర్‌ లగ్జరీ ఆడి కొత్త కారు కొన్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు ఉపాసన. తన లగ్జరీ కారుకు సంబంధించిన ఫీచర్స్ ఎలా ఉన్నాయో వివరిస్తూ ..” అత్యాధునిక సౌకర్యాలను కలిగిన ఈ లగ్జరీ ఆడి ఈ-ట్రాన్(Audi E-Tron) ఎంతో సురక్షితమైనది” అంటూ తన పోస్ట్‌లో చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం ఉపాసన కొన్న ఈ లగ్జరి కారు కాస్ట్ సుమారు కోటి 20 లక్షలు పైనే ఉంటుందట. దీంతో అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ నైస్ కార్ అంటూ చెప్పుకొస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news