Moviesమళ్లీ అదే తప్పు చేస్తున్న కొరటాల..తారక్ చెప్పుతున్న వినట్లేదా..?

మళ్లీ అదే తప్పు చేస్తున్న కొరటాల..తారక్ చెప్పుతున్న వినట్లేదా..?

నిన్న మొన్నటి వరకు కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేదని గర్వంగా చెప్పుకునే డైరెక్టర్ కొరటాల శివ ఫ్యాన్స్ కు ..ఆచార్య సినిమా తో ఆ ఆనందం పోయింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ షోతోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కధ బాగలేకపోవడం.. పెద్ద ట్వీస్ట్ లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ కంటికి ఆనలేదు. దీంతో కెరీర్ లో ఫస్ట్ ఫ్లాప్ రుచి చూశాడు కొరటాల.

అయితే, తారక్ తో తీసే సినిమా విషయంలో మాత్రం చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారట. కధ విషయంలో పక్కగా ప్లాన్ చెసి..పర్ఫెక్ట్ మాస్ సినిమాతో తారక్ ను చూపించబోతున్నాడట. ఇప్పటికే రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంది. తార చేతిలో ఆ కత్తి..ఆ కత్తికి అంటుకున్న రక్తం..దానికి తగ్గట్లు తారక్ చెప్పే డైలాగులు వింటుంటే గూస్ బంప్స్ రావాల్సిందే. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు ఫ్యాన్స్.

అయితే, కొరటాల ఆచార్య కి చేసిన తప్పే..ఈ సినిమాకి చేస్తున్నారట. ఆచార్య సినిమాలో హీరోయిన్ కోసం ఆరు నెలలకు పైగా కొరటాల టై వేస్ట్ చేసి..ఆ తరువాత ముందు అనుకున్న హీరోయిన్ కాజల్ నే పెట్టారు. ఆ తరువాత ఆమెను తీసేసి బుట్టబొమ్మను పెట్టుకున్నారు. కాగా, ఈ సినిమా విషయంలోను కొరటాల అదే తప్పు చేస్తున్నట్లు తెలుస్తుంది. హీరోయిన్ కోసం కొరటాల ఇంకా వెతుకుతూనే ఉన్నారట. అప్పటికి తారక్..రష్మిక, సాయి పల్లవి లను ఓకే చేసినా..కొరటాల వినకుండా..బాలీవుడ్ బ్యూటీలను దిపే పనిలో ఉన్నారట. దీని కోసం ఎంత టైం వేస్ట్ చేస్తారో అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . ఏది ఏమైన కొరటాల శివ ఈ సినిమా హిట్ కొట్టకపోతే..చాలా ఇబ్బందులు తప్పవు అంటున్నారు విశ్లేషకులు..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news