MoviesNTR30: సాయిప‌ల్ల‌విని హీరోయిన్‌గా ఎంట్రీ వెన‌క ఇంత క‌థ ఉందా...!

NTR30: సాయిప‌ల్ల‌విని హీరోయిన్‌గా ఎంట్రీ వెన‌క ఇంత క‌థ ఉందా…!

కొరటాల శివ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ఓ సినిమా చేయబోతోన్న విషయం తెలిసిందే. NTR30 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళుతోంది. గ‌తంలో ఎన్టీఆర్ – కొర‌టాల కాంబినేష‌న్లో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌రోసారి వీరి కాంబినేష‌న్ రిపీట్ అవుతుండ‌డంతో ఎన్టీఆర్ అభిమానుల్లోనే కాకుండా.. సినీ వ‌ర్గాల్లోనూ భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ఇటీవ‌ల ఎన్టీఆర్ బ‌ర్త్ డే కానుక‌గా రిలీజ్ చేసిన మోష‌న్ పోస్ట‌ర్ సెన్షేష‌న్ క్రియేట్ చేయ‌డంతో పాటు సినిమాపై భారీ అంచ‌నాలు పెంచేసింది. ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్‌తో పాటు అనిరుధ్ మ్యూజిక్ అంద‌రిని మైండ్ బ్లాకింగ్ అయ్యేలా చేశాయి. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో ఎవ‌రు హీరోయిన్ అవుతారు ? అన్న‌దానిపై గ‌త కొంత కాలంగా తీవ్ర త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు న‌డుస్తున్నాయి.

జాన్వీక‌పూర్‌.. ఆలియాభ‌ట్‌, కియారా అద్వానీ ఇలా ఎంతోమంది పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు వీరెవ్వ‌రు కాకుండా ఈ సినిమాలో జూనియ‌ర్‌కు జోడీగా డాన్సింగ్ క్వీన్ సాయిపల్లవిని ఫైనల్ చేశాడనే వార్త బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా చాలా బ‌లంగా ఉంటుంద‌ట‌. ఆ పాత్ర‌లో జీవించేలా లీన‌మైపోవాలంటే సాయిప‌ల్ల‌వే క‌రెక్ట్ అని ద‌ర్శ‌కుడు భావించిన‌ట్టు తెలుస్తోంది.

సాయిప‌ల్ల‌వి న‌ట‌నా ప‌రంగా మాత్ర‌మే కాదు.. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా న‌ట‌న‌లో పిండేస్తుంది. ఫిదా, ల‌వ్‌స్టోర‌, శ్యామ్‌సింగ రాయ్ సినిమాలు చూస్తుంటేనే మ‌తిపోతుంది. అందంతో పాటు న‌ట‌న‌, అటు డ్యాన్సుల్లో సాయిపల్ల‌వి స్టార్ హీరోల‌తో పోటీప‌డుతుంది. ఒక‌ప్పుడు సౌంద‌ర్య‌.. ఆ త‌ర్వాత నిత్యామీన‌న్‌.. ఇప్పుడు సాయిప‌ల్ల‌వి ఒక్కోసారి హీరోల‌ను డామినేట్ చేస్తూ న‌టించేస్తారు.

ఇక ఎన్టీఆర్ న‌ట‌నకు పోటీ ఇచ్చే హీరోయిన్లే ఉండ‌రు. ఎమోష‌న్‌, యాక్ష‌న్‌, కామెడీ ఏదైనా ఎన్టీఆర్‌కు కొట్టిన పిండి. ఇప్పుడు అటు టాలెంటెడ్ హీరోయిన్ సాయిప‌ల్ల‌వి వ‌ర్సెస్ ఎన్టీఆర్ మ‌ధ్య ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌తో పాటు పోటాపోటీగా న‌ట‌నతో ప్రేక్ష‌కుల‌కు ఫుల్ మీల్స్ ఇచ్చేయ‌నున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news