Moviesఒక్కో సినిమాకు సుకుమార్ ఎన్ని కోట్లు తీసుకుంటాడో తెలుసా?

ఒక్కో సినిమాకు సుకుమార్ ఎన్ని కోట్లు తీసుకుంటాడో తెలుసా?

సుకుమార్..తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వస్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఉన్న అగ్ర దర్శకులలో సుకుమార్ కూడా టాప్ 5 లిస్టులో ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్ కి..మిగతా డైరెక్టర్స్ దర్శకత్వానికి చాలా తేడా ఉంటుంది. సుకుమార్ అంటే లెక్కల మాస్టరు అంటూ పిలుస్తుంటారు ఇండస్ట్రీలో ఆయన సన్నిహితులు. ఆయన సినిమాలో ప్రతిది caluculations ప్రకారమే ఉంటుంది.

ఆయన తెరకెక్కించిన ఆర్య, 100% లవ్ సినిమాలు చూస్తే ఈ విషయం మనకు బాగా అర్ధమౌతుంది. సుకుమార్ ఏ హీరో తో సినిమా తీసిన ఆ హీరోలోని కూత యాంగిల్ ని బయటపెడతాడు. రామ్ చరణ్ ..ని రంగస్ధలం ఎంత నాచురల్ గా చూయించారో మనకు తెలిసిందే. ఇక అల్లు అర్జున్ ని అప్పటి వరకు క్లాస్ గా చూయించిన ఈయన..పుష్ప సినిమాలో మాత్రం ఫుల్ మాస్ లుక్స్ లో మార్చేసి..సంచలనం క్రియేట్ చేశాడు. ఈ సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

సుకుమార్ తెరకెక్కించే సినిమాల గురించి..ఆయన పనితనం గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సుకుమార్ తీసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద భారీ విజయాని అందుకోవడమే కాకుండా..కలెక్షన్స్ పరంగా కూడా ఇండస్ట్రీని షేక్ చేస్తాయి అనే పేరుంది. అయితే, ఇలాంటి పేరున్న డైరెక్టర్ రెమ్యూనరేషన్ తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. పాన్ ఇండియా లెవల్ గుర్తింపు తెచ్చిన పుష్ప సినిమా తరువాత ఆయన తన పారితోషకానీ అమాంతం పెంచేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటివరకు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్లలో రాజమౌళి, డైరెక్టర్ శంకర్ ఉండగా ఇప్పుడు సుకుమార్ కూడా ఆ స్థానాన్ని సంపాదించుకున్నాడు. దీంతో ఆయన క్రేజ్ పెరగడం వల్ల ఒక్కో సినిమాకి 50 కోట్ల ఛార్జ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. పుష్ప ముందు వరకు 35-40 కోట్లు పుచ్చుకునే వాడత. ఇక ఇప్పుడు పుష్ప 2 కి 50 కోట్లు పారితోషకం గా తీసుకుంటున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news