Moviesఅబ్బా..ఏం ఊపుతుంది రా సామీ.. శిల్పా శెట్టి హాట్ డాన్స్ వీడియో...

అబ్బా..ఏం ఊపుతుంది రా సామీ.. శిల్పా శెట్టి హాట్ డాన్స్ వీడియో వైరల్..!!

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శిల్పా శెట్టి ..అబ్బో ఈ ముద్దుగుమ్మ కు ఉన్న క్రేజ్ గురించి..ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా అమ్మడు అందాల విషయంలో కుర్ర బ్యూటీలకు కూడా గట్టి పోటీ ఇస్తుంది. అప్పుడెప్పుడో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా..ఇప్పటికి అంటే దాదాపు 50 కి దగ్గరలో ఉంది. అయినా కానీ , అందాల ఆరబోతల విషయంలో అస్సలు తగ్గేదేలే అంటూ రెచ్చిపోతుంది.


సాహసవీరుడు సాగరకన్య, వీడెవడండి బాబు, ఆజాద్‌ తదితర సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా బాగా చేరువైందీ ముద్దుగుమ్మ. సినిమాలు, టీవీ షోలతో నిత్యం బిజీబిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది. రకరకాల టిక్ టాక్ వీడియోలు చేస్తూ… పోస్టులు పెడుతుంటోంది. అంతేకాదు యోగా బ్యూటీ అయిన ఈ ముద్దుగుమ్మ హెల్దీ రెసిపీలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అయితే రీసెంట్ గా భర్త రాజ్ కుంద్రా చేస్తున్న ఈ చీకటి వ్యవహారం గురించి తెలిసిందే. ఈ విషయంలో శిల్పా శెట్టికి భాగముంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే భర్త చేసే ఈ పనుల గురించి తనకు తెలియదని పోలీసులకు, ప్రేక్షకులను చెప్పుకొచ్చింది శిల్పా శెట్టి. ఈ విషయంలో అనవసరంగా తనపై ఆరోపణలు చేయొవద్దని విజ్ఞప్తి చేసింది. కొన్ని రోజుల తర్వాత రాజ్ కుంద్రా బెయిల్ పై విడుదల అయ్యారు. దీనితో శిల్పా శెట్టి ఫ్యామిలీ కాస్త కుదుటపడింది.

అయినా కానీ బాలీవుడ్ పెద్దలు ఆమెను నమ్మడం లేదు. దీంతో ఆ విషయాలను లైట్ తీసుకున్న శిల్పా..మళ్ళీ తన బ్యాక్ లైఫ్ కి వచ్చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియోని షేర్ చేసింది. శిల్పా శెట్టి ప్రస్తుతం వెండితెరపై మళ్ళీ సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శిల్పా శెట్టి.. నికమ్మ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా తెలుగులో నాని హీరో గా నటించినMCA చిత్రానికి రీమేక్.

నాని వదిన గా చేసిన భూమిక పాత్రలో శిల్పా శెట్టి నటిస్తోంది. అభిమన్యు, షెర్లీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే .. తాజాగా ఓ సాంగ్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ సాంగ్ లో శిల్పా శెట్టి కూడా చిందులేసింది. మామూలు చిందులు కాదు..కుర్రాళ్ల మతి పోగొట్టే విధంగా డాన్స్ తో అదరగొట్టేసింది. దీంతో 46 ప్లస్ లో ను ఆ డ్యాన్స్ ఏంటి..ఆ ఎనర్జీ ఏంటి అంటూ శిల్పా శెట్టి డాన్స్ పై కుర్రాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news