సెలబ్రిటీలు మరింత అందంగా కనిపించేందుకు కాస్మోటిక్ సర్జరీలు చేయించుకోవడం.. ఇతర సర్జరీలు చేయించుకోవడం మామూలుగా జరుగుతూ ఉంటుంది. మన టాలీవుడ్ హీరోలే చాలా మంది ఫేస్ సర్జరీలు చేయించుకుని.. అందంగా కనిపిస్తున్నారు. మరికొందరు హీరోయిన్లు అయితే దవడ, ముక్కు సర్జరీలు చేయించుకున్నారు. కొందరు హీరోయిన్లు తమ బ్రెస్ట్ సైజ్ పెంచుకునేందుకు కూడా సర్జరీలు చేయించుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి.
కొందరు సెలబ్రిటీలు అంత అందంగా ఉండరు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు అయితే ఇండస్ట్రీలో మరింతగా రాణించాలన్న కోరికతో… మరింత అందంగా కనిపించేందుకు శస్త్రచికిత్సలు చేయించు కుంటూ ఉంటారు. ఇలా శస్త్రచికిత్స చేయించుకున్న విషయాన్ని కొందరు సెలబ్రిటీలు ఓపెన్‌గానే చెపుతూ ఉంటారు. మరి కొందరు మాత్రం దీనిని దాచేస్తూ ఉంటారు.
నిన్నటి తరం అతిలోక సుందరి శ్రీదేవి నుంచి నేటి తరం రకుల్‌ప్రీత్ సింగ్ వరకు ఎంతో మంది హీరోయిన్లు సర్జరీలు చేయించుకున్నారు. శ్రీదేవి ముక్కు వంకరగా ఉండేదట. అందుకే ఆమె సర్జరీ చేయించుకున్నారని అంటారు. సర్జరీకి ముందే శ్రీదేవి చాలా అందంగా ఉండేదని కూడా ఆమె అభిమానులు చెపుతూ ఉంటారు.
ఇక కాజల్ , సమంత, శృతీహాసన్ లాంటి స్టార్ హీరోయిన్లు కాస్మోటిక్ సర్జరీలు చేయించుకున్నారు. తాజాగా మళయాళం బ్యూటీ కీర్తి సురేష్ కూడా తన పెదవులకు సర్జరీ చేయించుకుందనే ప్రచారం సాగుతోంది. తాజాగా ఆమె నటించిన సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో కొన్ని సీన్లలో కీర్తి ఫేస్‌లో పెదాల్లో మార్పులను గమనించామని కొందరు చెపుతున్నారు.
కీర్తి పెదాల్లో మార్పులు స్పష్టంగా వచ్చాయనే చాలా మంది అంటున్నారు. ఓవరాల్‌గా కూడా కీర్తి గత సినిమాలతో పోలిస్తే ఆమె కాస్త ఒళ్లు చేసి బబ్లీగా కనిపిస్తోందన్నది మాత్రం నిజం. మహానటి తర్వాత ఆమె రేంజ్‌కు తగిన సక్సెస్ ఇదే అని చెప్పాలి.