Moviesఇద్ద‌రు క్రేజీ డైరెక్ట‌ర్ల‌తో స‌హ‌జీవ‌నం... ఫ్యామిలీల‌ను ముంచేసిన టాలీవుడ్ హీరోయిన్‌...!

ఇద్ద‌రు క్రేజీ డైరెక్ట‌ర్ల‌తో స‌హ‌జీవ‌నం… ఫ్యామిలీల‌ను ముంచేసిన టాలీవుడ్ హీరోయిన్‌…!

ఎక్క‌డో నార్త్ నుంచి టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఓ హీరోయిన్‌. పొట్టిగా ఉన్నా అందంతో పాటు అభిన‌యం కూడా ఉండ‌డంతో కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస‌గా హీరోయిన్ ఛాన్సులు ద‌క్కించుకుంది. ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, బాల‌య్య‌, నాగార్జున‌, వెంక‌టేష్ లాంటి స్టార్, క్రేజీ హీరోల‌తో న‌టించింది. కాస్త వ‌య‌స్సులో యంగ్ హీరోయిన్‌గా ఉన్న‌ప్పుడే ఓ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ త‌న సినిమాల్లో వ‌రుస‌గా ఛాన్సులు ఇచ్చుకుంటూ వ‌చ్చాడు. ఇలా వ‌రుస ఛాన్సులు ఇచ్చిన‌ప్పుడే ఆ డైరెక్ట‌ర్‌తో ఆమెకు ఎఫైర్ ఉంద‌న్న వార్త‌లు వైర‌ల్ అయ్యాయి.

ఆ ఎఫైర్ వ‌ల్ల స‌ద‌రు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ భార్య సైతం కొంత కాలం ఆయ‌న‌కు దూర‌మైపోయింద‌ని.. ఇద్ద‌రి మ‌ధ్య చాలా అపోహ‌లు వ‌చ్చాయ‌ని.. చివ‌ర‌కు వారు విడిపోయేంత వ‌ర‌కు వ్య‌వ‌హారం రావ‌డంతో కొంద‌రు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు స‌ద‌రు డైరెక్ట‌ర్ భార్య‌కు ఇవ‌న్నీ కామ‌నే కొద్ది రోజుల‌కే స‌ర్దుకుపోతాయ‌ని చెప్పి క‌న్వీన్స్ చేశారు. దీంతో ఎట్ట‌కేల‌కు ఆ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కాపురం పెటాకులు కాకుండా నిల‌బ‌డింది.

ఆ త‌ర్వాత కొన్ని సినిమాలు చేసిన స‌ద‌రు హీరోయిన్ ఇప్పుడు ముద‌రు హీరోయిన్ అవ్వ‌డంతో పాటు హీరోయిన్‌గా ఫేడ‌వుట్ అయిపోయింది. ఇక ఇప్పుడు మ‌రో క్రేజీ డైరెక్ట‌ర్‌ను ప‌ట్టుకుంది. ఆమెతో ఓ అడ‌ల్డ్ టైప్ సినిమా కూడా ఆ డైరెక్ట‌ర్ చేశాడు. ఆ త‌ర్వాత ఆ డైరెక్ట‌ర్ కౌంపౌండ్‌లో ఆమె దూరిపోయింది. అక్క‌డ నుంచి ఆ డైరెక్ట‌ర్ కెరీర్ త‌ల్ల‌కిందులు అయిపోయింది.

ఓ క్రేజీ హీరోతో హిట్ కొట్టాడు. అక్కడ నుంచి వ‌రుస ప్లాపుల‌తో విల‌విల్లాడిపోయాడు. చివ‌ర‌కు స్టార్ హీరోలు క‌థ చెపుతామ‌న్నా కూడా అత‌డికి అపాయింట్‌మెంట్ ఇవ్వ‌ని దుస్థితికి దిగ‌జారిపోయాడు. పాఫం ఓ కుర్ర హీరోతో హిట్ కొట్టి మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చాడు. విచిత్రం ఏంటంటే ఆ డైరెక్ట‌ర్‌ను ప‌త‌నం చేసిన ఆ హీరోయిన్ .. ఆ హిట్ సినిమాలో చేసిన కుర్ర హీరోను కూడా వాడేసుకుంద‌ట‌.

ఆ డైరెక్ట‌ర్‌ది కూడా ప్రేమ వివాహ‌మే. ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లు. ఎప్పుడు అయితే స‌ద‌రు హీరోయిన్ ఆ డైరెక్ట‌ర్ జీవితంలోకి ఎంట‌ర్ అయ్యిందో … ఆ డైరెక్ట‌ర్‌కు కూడా భార్య‌తో గ్యాప్ వ‌చ్చేసింది. మ‌ధ్య‌లో విడిపోతార‌న్న ప్ర‌చార‌మూ జ‌రిగింది. అయితే స‌ద‌రు డైరెక్ట‌ర్ భార్య‌కు స‌ర్దుకుపోయే మ‌న‌స్త‌త్వం ఉండ‌డంతో పాటు త‌న భ‌ర్త కెరీర్ త‌న వ‌ల్ల డిస్ట‌ర్బ్ కాకూడ‌ద‌ని పాపం ఓర్చుకుని ఉంటోంది. ఇది ఆ ముదురు హీరోయిన్ భాగోతం..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news