Moviesరేణుదేశాయ్ క‌మిట్‌మెంట్ ఇవ్వ‌దు... సీనియ‌ర్ డైరెక్ట‌ర్ దిగ‌జారుడు కామెంట్స్‌

రేణుదేశాయ్ క‌మిట్‌మెంట్ ఇవ్వ‌దు… సీనియ‌ర్ డైరెక్ట‌ర్ దిగ‌జారుడు కామెంట్స్‌

సినిమా ప్ర‌పంచంలో హీరోయిన్లు, లైంగీక వేధింపులు, క‌మిట్‌మెంట్స్ అనే వాటిపై ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. గ‌త కొంత కాలంగా కాస్టింగ్ కౌచ్‌, మీ టు ప‌దాలు సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతున్నాయి. కొంద‌రు హీరోయిన్లు అయితే ఇవి న‌చ్చ‌క రోడ్డెక్కి నానా ర‌చ్చ చేశారు. అస‌లు ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్ప‌టి నుంచో ఉంది. అయితే అప్ప‌ట్లో ఇంత మీడియా హ‌డావిడి లేదు. పైగా కాస్టింగ్ కౌచ్‌, లైంగీక వేధింపులు ఎదుర్కొన్నామ‌ని ఎవ‌రి పేర్లు అయినా బ‌య‌ట పెడితే వారికి అవ‌కాశాలు ఇచ్చేవాళ్లు కాదు.

దాంతో ఆ హీరోయిన్లు త‌మ కెరీర్ ఎక్క డ కోల్పోతామ‌న్న భ‌యంతో అణిగిమ‌ణిగి ఉండేవారు. ఇక గ‌త నాలుగేళ్లుగా మాత్రం సౌత్‌, నార్త్ తేడా లేకుండా మీడియం రేంజ్ హీరోయిన్ల నుంచి స్టార్ హీరోయిన్ల వ‌ర‌కు అంద‌రూ కూడా కాస్టింగ్ కౌచ్ గురించి గ‌ళం ఎత్తుతున్నారు. నార్త్‌లో కంగ‌నా ర‌నౌత్‌, రాధికా ఆఫ్టే, సౌత్‌లో శ్రీరెడ్డి, సింగ‌ర్ చిన్మ‌యి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ధైర్యంగా తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి ఓపెన్ అవుతున్నారు.

ఇక అస‌లు విష‌యంలోకి వెళితే సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గీతా కృష్ణ ఒక‌ప్పుడు కోకిల‌, కీచురాళ్లు, సంకీర్త‌న లాంటి మంచి సినిమాలు తీశారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఫేడ‌వుట్ అయిపోయి అంద‌రూ మ‌ర్చిపోయారు. అయితే ఇప్పుడు వాయిస్ ఉండ‌డంతో వ‌రుస‌గా యూట్యూబ్ ఇంట‌ర్వ్యూలు ఇస్తూ ఏదో ఒక సంచ‌ల‌నాల‌తో వార్త‌ల్లో ఉండేందుకే ఇష్ట‌ప‌డుతున్నారు. ఆయ‌న చేస్తోన్న వ్యాఖ్య‌ల కంటే వాటిని వ్యూస్ కోసం మ‌రింత వైర‌ల్ చేసేందుకు యూట్యూబ్ ఛానెల్స్ మ‌రింత దిగ‌జారుతున్నాయి.

నీచ‌మైన థంబ్ నెయిల్స్, టైటిల్స్ పెడుతూ కావాల్సినంత ర‌చ్చ క్రియేట్ చేస్తున్నాయి. చాలా మంది హీరోయిన్లు కెరీర్‌లో రాణించేందుకు క‌మిట్‌మెంట్లు ఇస్తున్నారనేదే గీతా కృష్ణ ఆరోప‌ణ‌. ఇది నిజం.. దీనిని ఎవ్వ‌రూ త‌ప్పుప‌ట్ట‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కొంద‌రు హీరోయిన్ల పేర్లు కూడా ప్ర‌స్తావించ‌డం వివాదాస్ప‌ద‌మైంది. ఆయ‌న రేణు దేశాయ్ పేరు ప్ర‌స్తావిస్తూ తాను ఆమె ఫొటో చెన్నై నుంచి తీసుకుని ముంబై వెళ్లాన‌ని.. తాను తీసే టైం సినిమాలో ఆమెనే హీరోయిన్‌గా తీసుకోవాల‌ని అనుకున్నాన‌ని చెప్పారు.

అయితే అక్క‌డ అప్ప‌టికే చాలా మంది హీరోయిన్ల ఫొటోలు ఉన్నాయని… కానీ అక్క‌డ ఉన్న ఓ లేడీ మేనేజ‌ర్ మాత్రం ఆ అమ్మాయి దేనికి స‌రిగా కోప‌రేట్ చేయ‌దండి.. ఆ అమ్మాయితో అస‌లు ప‌డ‌లేం.. చాలా ఇబ్బంది పెడుతుంద‌ని చెప్పింద‌ని గీతా కృష్ణ చెప్పారు. అయితే ఆమె అలా ఎందుకు అన్న‌దో త‌న‌కు అర్థం కాలేద‌ని.. త‌ర్వాత రేణు దేశాయ్ ఫోన్ నెంబ‌ర్ తీసుకుని ఫోన్ చేస్తే ఆమె వ‌చ్చి త‌న‌కు అస‌లు విష‌యం చెప్పింద‌ని అన్నారు.

ఏంట‌మ్మా నీ గురించి ఇలా మాట్లాడుతున్నారు అని అడిగితే నేను క‌మిట్‌మెంట్లు లాంటి వాటికి పూర్తిగా వ్య‌తిరేకం అని ఆమె చెప్ప‌డంతోనే త‌న‌కు అస‌లు విష‌యం తెలిసింద‌ని.. వెంట‌నే తాను నువ్వే నా సినిమా హీరోయిన్ అని ఆమెను సెల‌క్ట్ చేశాన‌ని గీతా కృష్ణ చెప్పారు. ఇక్క‌డ రేణు వ్య‌క్తిత్వం గురించి ఆయ‌న చెప్పినా ఇప్పుడు ఆయ‌న ఏదో కావాల‌ని హైలెట్ అయ్యేందుకు ఆమె పేరు లాగిన‌ట్టుగా అనిపిస్తోంది.

గీతా కృష్ణ మ‌రీ దిగ‌జారి కామెంట్లు చేస్తున్నాడ‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. గ‌తంలో కూడా గీతా కృష్ణ జూనియ‌ర్ ఎన్టీఆర్ అతిగా మాట్లాడ‌తాడు అని.. అటు రామ్‌చ‌ర‌ణ్ గురించి కామెంట్ చేయ‌డం.. ఇటు కోట శ్రీనివాస‌రావును ముస‌లోడు అని తిట్టడం లాంటి కాంట్ర‌వ‌ర్సీ కామెంట్ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news