Moviesఆ సెల‌బ్రిటీ జంట విడాకుల వెన‌క క్రేజీ హీరోయిన్‌...!

ఆ సెల‌బ్రిటీ జంట విడాకుల వెన‌క క్రేజీ హీరోయిన్‌…!

స‌ల్మాన్‌ఖాన్ సోద‌రుడు అర్బాజ్‌ఖాన్‌, మ‌లైకా అరోరా జంట ఎప్పుడో విడాకులు తీసుకుంది. వీరి విడాకుల‌కు ప్ర‌ధాన క‌ర‌ణం మ‌లైకా అరోరా త‌న కంటే వ‌య‌స్సులో ప‌దేళ్లు చిన్నోడు అయిన అర్జున్ క‌పూర్‌తో డేటింగ్ చేయ‌డ‌మే అన్న విష‌యం తెలిసిందే. 20 ఏళ్ల పాటు కాపురం చేసి.. ఇద్ద‌రు పిల్ల‌ల‌ను క‌న్నాక కూడా వీరు విడిపోయారు. స‌ల్మాన్ ఈ జంట‌ను క‌లిపి ఉంచేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా అవేవి సాధ్యం కాలేదు.

ఇక ఇప్పుడు అర్జున్ క‌పూర్ – మ‌లైకా ఇష్టం వ‌చ్చిన‌ట్టు చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇక ఇప్పుడు స‌ల్మాన్ మ‌రో సోద‌రుడు సోహైల్ ఖాన్ విడాకుల వ్య‌వ‌హారం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సోహైల్ ఖాన్ త‌న 24 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వ‌స్తి ప‌లుకుతూ భార్య నుంచి విడిపోతున్నాడు. త‌న భార్య సీమాకు విడాకులు ఇచ్చేస్తున్నాడు. వీరిద్ద‌రు క‌లిసి ముంబై ఫ్యామిలీ కోర్టుకు హాజ‌రు కావ‌డంతో వీరు విడాకులు తీసుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది.

సోహైల్ ఖాన్ – సీమా స‌చ్‌దేవ్ వివాహం చేసుకున్నాక 24 ఏళ్ల త‌ర్వాత ఇడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. 1998లో పెళ్లి చేసుకున్న ఈ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. అయితే ఈ జంట విడాకుల‌కు కార‌ణం హీరోయిన్ హ్యూమా ఖురేషీ అన్న వార్త‌లు వ‌స్తున్నాయి. సోహైల్ – హ్యూమా గ‌త కొంత కాలంగా క‌లిసి పార్టీలు చేసుకోవ‌డంతో పాటు వీరిద్ద‌రు క‌లిసి సీమాను ఇబ్బంది పెట్టిన‌ట్టు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే వీరిద్ద‌రి విడాకుల వ్య‌వ‌హారంలోకి త‌న పేరు లాగ‌డంపై హ్యామా మండి ప‌డుతోంది. త‌న క‌ష్టార్జితానికి దూరంగా ఇత‌రుల విష‌యాల్లోకి త‌న పేరు లాగ‌డం స‌రికాద‌ని వాపోయింది. పైగా సోహైల్ త‌న‌కు అన్న‌య్య లాంటి వాడ‌ని బాంబు పేల్చ‌డం విచిత్రం. కానీ బాలీవుడ్ మీడియా మాత్రం సోహైల్ – హ్యామా చెట్టాప‌ట్టాల వ‌ల్లే సీమ మాన‌సికంగా ఇబ్బంది ప‌డింద‌ని.. అక్క‌డ నుంచే వీరి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌ని చెపుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news