Moviesఎన్టీఆర్ బర్త డే: మాటల్లో చెప్పలేను అంటూ చరణ్ స్పెషల్ విషేస్..!!

ఎన్టీఆర్ బర్త డే: మాటల్లో చెప్పలేను అంటూ చరణ్ స్పెషల్ విషేస్..!!

అభిమానులు వాళ్ళ పుట్టిన రోజులను అయినా ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారో లేదో తెలియదువ్కానీ, ప్రతి సంవత్సరం మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలను మాత్రం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే ఎంజా చేస్తారు. అది వాళ్ళ తారక్ పై ఉండే ప్రేమ, అభిమానం. ఈ రోజు మే 20 యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. అంటే అభిమానులకు మరో సంక్రాంతి. అలా యంగ్ టైగర్ మాస్ ఫాలోయింగ్‌కు నేడు పెద్ద పండుగ. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ అర్దరాత్రి నుంచే హంగామా మొదలుపెట్టేశారు.

కొందరు వేరే ఊర్లో ఉండే తారక్ ఫ్యాన్స్ యంగ్ టైగర్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు హైదరాబాద్ తరలివచ్చారు. దీంతో.. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆయన ఇంటి దగ్గర హడావుడి చేశారు. ఇక సినీ ప్రముఖులు అంతా కూడా సోషల్ మీడియా వేదికగా..తారక్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. స్టార్ సీనీయర్ హీరోలు మొదలు యంగ్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు..అందరు తారక్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రాం చరణ్..తారక్ కు స్పెషల్ విషేస్ అందించారు. సోషల్ మీడియా వేదికగా వాళ్లు హగ్ చేసుకున్న ఫోటోని పోస్ట్ చేస్తూ..”నిన్ను బ్రదర్ అనాలో, ఫ్రెండ్ అనాలో, కో స్టార్ అనాలో..నాకు తెలియదం లేదు. నీకూ నాకూ మధ్య ఉన్న బంధాన్ని చెప్పడానికి మాటలు రావడం లేదు.. మన ఇద్దరి మధ్య ఉన్న ఈ బంధాన్ని నా లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటూ ఉంటాను.. హ్యాపీ బర్త్ డే తారక్” అని రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. దీంతో MEGA_NANDAMURI అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మీ ఫ్రెండ్ షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నారు.

 

Latest news